Homeఆంధ్రప్రదేశ్‌AP Digital Governance 2025: విధ్వంసం నుంచి విజన్ పాలన వరకు: ఏపీకి కొత్త దిక్సూచి!

AP Digital Governance 2025: విధ్వంసం నుంచి విజన్ పాలన వరకు: ఏపీకి కొత్త దిక్సూచి!

AP Digital Governance 2025: విధ్వంసం నుంచి సుపరిపాలన వైపు అడుగులు వేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం( Alliance government) . గత ఏడాదిగా సుపరిపాలన అందిస్తూ ప్రజల్లో ఒక రకమైన సంతృప్తి శాతాన్ని అందుకుంది. వైసీపీ నవరత్నాల హామీలకు 2019లో అధికారంలోకి వచ్చింది. తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. అయితే సంక్షేమం మాటున అభివృద్ధి మరుగున పడిపోయింది. అయితే వైసిపి ఏలు బడిలో వచ్చిన అన్ని రకాల ఎన్నికలు ఆ పార్టీకి అనుకూల ఫలితాలను ఇచ్చాయి. దీంతో విజయ గర్వంతో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి అనే మాట మరిచిపోయింది. రాష్ట్రాన్ని 20 ఏళ్ల వెనుకబాటుకు నెట్టేసింది. దానిని అధిగమించేందుకు.. రాజకీయంగా ప్రజలను ఆకర్షించేందుకు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు చంద్రబాబు. ప్రత్యేక మేనిఫెస్టో అమలు చేసి 36 రకాల హామీలు ఇచ్చారు. ప్రజలకు అత్యవసరమైన పథకాలను ప్రారంభిస్తూనే అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గత ఏడాది కాలంలో సంక్షేమం కంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కువగా జరిగింది. ఇది కాదనలేని సత్యం కూడా.

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు..
అయితే విప్లవాత్మక పాలనతో ముందుకు సాగింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్( WhatsApp governance) ద్వారా పౌర సేవలతో పాటు సంక్షేమ పథకాలు అందించేందుకు కూడా నిర్ణయించింది. దాదాపు 200 సేవలను ఇంటి నుంచి పొందే అవకాశం కల్పించింది. మరో 300 సేవలను సైతం అలానే అందించేందుకు నిర్ణయించింది. విద్యార్థుల హాల్ టికెట్ల పంపిణీ, పరీక్ష ఫలితాలు, చివరకు రేషన్ కార్డుల దరఖాస్తులు సైతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించడంలో విజయం సాధించింది. భవిష్యత్తులో ప్రజలు ఇంటి నుంచి పౌర సేవలు పొందేందుకు, పాలనాపరమైన సేవలు పొందేందుకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

Also Read: AP Development : ఏపీకి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రాధాన్యం..
భావితరాలకు ఉద్యోగ ఉపాధి నిచ్చే రంగాలను ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో ప్రధానమైనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( artificial intelligence). ప్రపంచం పరుగెడుతున్న వేళ ఈ కొత్త విధానం ద్వారా ప్రజల జీవన గమనాన్ని మార్చాలని చంద్రబాబు భావించారు. మరోవైపు డ్రోన్ల రంగాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అమరావతిని డ్రోన్ల హబ్ గా మార్చాలి అన్నది చంద్రబాబు లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా అడుగులు వేశారు. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ యంత్రాంగం పై భారం తగ్గి.. నేరుగా ఇంటి నుంచే పౌర సేవలతో పాటు పాలనా ఫలాలు అందుకోవాలని భావించారు. ఒకవైపు ఐటి, ఇంకోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరోవైపు వాట్సాప్ గవర్నెన్స్, డ్రోన్ల రంగం అభివృద్ధి, ఐటీ పరిశ్రమల స్థాపన.. ఇలా ఏడాది పాలనలో కీలకమైన అంశాలకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. మరో నాలుగేళ్లలో ఈ రంగాలలో గణనీయమైన అభివృద్ధి సాధించే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular