HomeతెలంగాణTelangana municipal election results: తెలంగాణ మొత్తం ఒక ఎత్తు.. ఈ మున్సిపాలిటీలు మరొక ఎత్తు.....

Telangana municipal election results: తెలంగాణ మొత్తం ఒక ఎత్తు.. ఈ మున్సిపాలిటీలు మరొక ఎత్తు.. ఎందుకంటే

Telangana municipal election results: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ మెజారిటీకి మించిన స్థానాలను సొంతం చేసుకుంది. తద్వారా ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీదనే నమ్మకం ఉంచారని నిరూపించుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే.. అందులో చాలావరకు స్థానాలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి దూకుడు కొనసాగించింది. ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సత్తా చూపించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అధికారంలో ఉన్నప్పటికీ చాలా వరకు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని అందుకోలేకపోయింది. అటు గులాబీ పార్టీకి కూడా అవకాశం లేకుండా పోయింది. మధ్యలో కమలం పార్టీ కూడా అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల హంగ్ పరిస్థితి ఏర్పడింది. కేసముద్రం, దేవరకొండ, దేవరకద్ర, అలంపూర్, కోహిర్, అమరచింత, ఆసిఫాబాద్, ఖ్యాతనపల్లి, జనగామ మున్సిపాలిటీలలో హంగ్ ఏర్పడింది.

హంగ్ ఏర్పడిన నేపథ్యంలో క్యాంపు రాజకీయాలకు పార్టీలు శ్రీకారం చుట్టాయి. గులాబీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా శిబిర రాజకీయాలు మొదలుపెట్టాయి. దీంతో మున్సిపల్ పీఠం దక్కేది ఎవరికనే ఆసక్తి మొదలైంది. పీఠాన్ని దక్కించుకోవడానికి రెండు పార్టీలు పోటాపోటీగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో గెలిచిన వారి పంట పండే అవకాశం ఉంది. ఎందుకంటే శిబిర రాజకీయాలు మొదలైన తర్వాత గెలిచిన అభ్యర్థులు గొంతెమ్మ కోరికలు కోరుతారు. వాటిని నెరవేర్చడానికి పార్టీలు ఏమాత్రం వెనుకాడవు. అయితే ఆ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలో ఉండడంతో చాలామంది అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే గులాబీ పార్టీ తమ అభ్యర్థులు దారితప్పకుండా జాగ్రత్త పడుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా అభ్యర్థులను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకుంది.

ఈ స్థానాలను గులాబీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. పరిస్థితి ఉత్కంఠ గా మారింది. స్వయంగా ఈ మున్సిపాలిటీలలో పరిస్థితిని మాజీ మంత్రి కేటీఆర్ పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో.. ఏదైనా జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ పై స్థానాలలో గులాబీ పార్టీ గనుక సత్తా చూపిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణ తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Vaibhav Suryavanshi: తెలుగు గడ్డకు.. సూర్య వంశీకి ఏంటి సంబంధం.. వీవీఎస్ లక్ష్మణ్ చెప్పిన నిజం..

Vaibhav Suryavanshi: యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్య వంశీ జింబాబ్వే సిరీస్లో అదరగొట్టాడు. టీ మీడియా సాధించిన విజయాలలో ముఖ్యపాత్ర పోషించాడు. రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు. తద్వారా తన మీద...

Hydra Ranganath: హైడ్రా రంగనాథ్ కూడా మనిషే.. అతడికీ కోపం ఉంటుంది..

Hydra Ranganath: ఆవుల వెంకట రంగనాథ్.. అలియాస్ హైడ్రా రంగనాథ్.. గడిచిన రెండు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఈ పేరు తెలంగాణ రాజకీయాలలో వినిపిస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర...

Vijay: విజయ్ తర్వాత తమిళ్ ఇండస్ట్రీ లో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునేది ఆయనేనా…

Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు విజయ్ నెంబర్ వన్ హీరోగా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు వెళ్లిపోయాడు. కాబట్టి తను సినిమాలు చేసే అవకాశామైతే లేదు. ఇక రీసెంట్...

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...
Oktelugu Epaper
Exit mobile version