Homeఆంధ్రప్రదేశ్‌August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 రోజులు సెలవులు రానున్నాయి ఈ ఆగస్టు నెలలో. ఆదివారాలతో కలుపుకొని దాదాపు పది రోజుల వరకు సెలవులు రానున్నాయి. రెండో శనివారం తో పాటు ఆగస్టు 15, వరలక్ష్మీ వ్రతం, రాఖీ, మిలాద్ ఉన్ నబి వంటి సెలవులు ఉన్నాయి. వీటితో పాటుగా ఉద్యోగులకు అప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. ఆగస్టు నెలలో ఏకంగా 5 ఆదివారాలు వచ్చాయి. ఒక రెండో శనివారం వచ్చింది. మిగతావి పండుగల రూపంలో సెలవులు వచ్చాయి విద్యార్థులకు.

* 21 రోజులు పని దినాలు..
ఆగస్టులో మొత్తం 31 రోజులు ఉన్నాయి. అందులో పది రోజులు సెలవులు రావడం విశేషం. ఈ లెక్కన ఈ నెలలో పాఠశాలలు 21 రోజు మాత్రమే పని చేస్తాయి. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఆపై వరలక్ష్మీ వ్రతం రూపంలో సెలవు రానుంది.
* ఆగస్టు 2 సాధారణ ఆదివారం
* ఆగస్టు 8 రెండో శనివారం
* ఆగస్టు 9 సాధారణ ఆదివారం
* ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, జండా వందనం
* ఆగస్టు 16 సాధారణ ఆదివారం
* ఆగస్టు 21 శుక్రవారం వరలక్ష్మీ వ్రతం
* ఆగస్టు 23 సాధారణ ఆదివారం
* ఆగస్టు 25 మంగళవారం మిలాద్ ఉన్ నబి సెలవు దినం
* ఆగస్టు 30న సాధారణ ఆదివారం

* విశాఖలో అదనంగా రెండు రోజులు..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖ, సంబంధిత సంస్థలు సెలవుల అమలుకు సంబంధించి విడుదల చేసే అధికారిక ఉత్తర్వులు మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే విశాఖ జిల్లా సింహాచలంలో జరిగే వార్షిక గిరి ప్రదక్షిణ సందర్భంగా పాఠశాలలతో పాటు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. గిరి ప్రదక్షిణ నిర్వహణ దృష్ట్యా జూలై 28, 29 తేదీల్లో ప్రదక్షణ మార్గంలో ఉన్న 221 స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్ల దృష్ట్యా విద్యాసంస్థలకు ఆ రెండు రోజులు సెలవులను ప్రకటించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...

Jagan Mohan Reddy: కాక్రోచ్ సరే.. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ మాటేంటి జగన్?!

Jagan Mohan Reddy: దేశంలోనే నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద వివాదమే రేపింది. చివరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థి లోకం పోరాటం చేసింది. జనతా కాక్రోచ్...
Oktelugu Epaper
Exit mobile version