https://oktelugu.com/

Telangana Government : తాగినోళ్లకు తాగినంత.. మందుబాబులకు ఇదో గొప్ప గుడ్ న్యూస్

Telangana Government :వేసవి కాలం మొదలైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) బీరు ధరలను ఇటీవలే 15 శాతం పెంచింది. అమ్మకాలు ఎక్కడా తగ్గలేదు. ఇక పోతే.. బీర్ల అమ్మకాలు మరింత పెంచేందుకు ప్రభుత్వం మరో ఆలోచన చేసింది. బీరు ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

Written By: , Updated On : April 1, 2025 / 01:21 PM IST
Instant beer cafe

Instant beer cafe

Follow us on

Telangana Government : తెలంగాణ ప్రభుత్వానికి 11 ఏళ్లుగా మద్యం అమ్మకాలు మంచి ఆదాయమార్గం(Income Sorce)గా మారాయి. దీంతో ఎంత తాగితే అంత మంచిది అన్నట్లు పాలకులు కూడా మద్యం షాపులు పెంచుతున్నారు. అన్నిరకాల మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. ఇక వేసవిలో బీర్ల ధరలు పెంచుతూ వస్తన్నాయి. దీంతో మద్యం అమ్మకాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇన్‌స్టంట్‌ బీర్‌ కేఫ్‌(Instant beer cafe)ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలిస్తోందని సమాచారం. ఈ ఆలోచన ఇన్‌స్టంట్‌ కాఫీ షాపుల తరహాలో ఉంటుం., అంటే వినియోగదారులు త్వరగా బీర్‌ను పొందే విధంగా ఈ కేఫ్‌లు రూపొందించబడతాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది, ఎందుకంటే తెలంగాణలో బీర్‌ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. నెలకు 45 లక్షల నుంచి 55 లక్షల కేసుల బీర్‌ అమ్ముడవుతుందని అధికారిక డేటా చెబుతోంది.

Also Read : గచ్చి బౌలి లో ఆ 400 ఎకరాల వెనుక అసలు కథ ఇది..

ఇన్‌స్టంట్‌ బీర్‌ కేఫ్‌ల ఉద్దేశం
ఈ కేఫ్‌లు సాధారణంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌(Hyderabad) వంటి నగరాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇవి మైక్రో బ్రూవరీ(Micro Bruvary)లకు భిన్నంగా ఉంటాయి. మైక్రో బ్రూవరీలు బీర్‌ను ఉత్పత్తి చేస్తాయి, కానీ ఇన్‌స్టంట్‌ బీర్‌ కేఫ్‌లు డ్రాఫ్ట్‌ బీర్‌ను వేగంగా సరఫరా చేయడంపై దృష్టి సారిస్తాయి. ఈ కేఫ్‌లు యువత మరియు బీర్‌ ప్రియులను ఆకర్షించేలా ఆధునిక వాతావరణంతో రూపొందించబడతాయని అంచనా. అలాగే, ఈ కేఫ్‌లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉపాధి అవకాశాలు, ఆతిథ్య రంగంలో వృద్ధి వంటి ప్రయోజనాలను తీసుకురావచ్చు.

ప్రస్తుత పరిస్థితి..
2025 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం బీర్‌ ధరలను 15% పెంచింది. దీనివల్ల ఒక బాటిల్‌ ధర సుమారు రూ.30 నుంచి రూ.50 వరకు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టంట్‌ బీర్‌ కేఫ్‌లు వస్తే, ధరలు సరసమైన స్థాయిలో ఉంచే అవకాశం ఉంది, తద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించవచ్చు. అయితే, ఈ కేఫ్‌ల ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఆసక్తికర విషయాలు
– తెలంగాణలో ఇప్పటికే 9 డిస్టిలరీలు, 6 బీర్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి, 51 కంపెనీలు 1,031 రకాల లిక్కర్‌ మరియు బీర్‌లను విక్రయిస్తున్నాయి.

– రాష్ట్రంలో 2,620 లిక్కర్‌ షాపులు, 1,117 బార్‌లు, పబ్‌లు ఉన్నాయి, ఇవి ఏటా రూ.36 వేల నుంచి రూ.40 వేల కోట్ల ఎక్సైజ్‌ రెవెన్యూను రాష్ట్రానికి అందిస్తున్నాయి.

– ఇన్‌స్టంట్‌ బీర్‌ కేఫ్‌లు వస్తే, వీటిలో స్థానికంగా తయారైన 50 బీర్‌ బ్రాండ్‌లు మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే 36 బ్రాండ్‌లు అందుబాటులో ఉండవచ్చు.

Also Read : పాసుల కోసం SRHను వేధించిన HCA: సీఎం సీరియస్ చర్యలు