Gachibowli : అధికారం కోల్పోయిన తర్వాత భారత రాష్ట్ర సమితి పూర్తిగా ప్రజాస్వామ్య పార్టీ అయిపోయింది. జనం కోసం కొట్లాడే పార్టీ అయిపోయింది. జనం సమస్యల గురించి మాట్లాడే పార్టీ అయిపోయింది. ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పనిని సమర్థించడం లేదు గాని.. జనంలోకి అవాస్తవాలను తీసుకుపోవడంలో మాత్రం భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం విపరీతంగా పనిచేస్తోంది. ఇక కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అయితే ఇక్కడ గచ్చిబౌలి ప్రాంతంలోని ఆ 400 ఎకరాల గురించి చాలా వాస్తవాలే ఉన్నాయి. కాకపోతే తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా భారత రాష్ట్ర సమితి ఇక్కడ వ్యాఖ్యలు చేయడమే అసలైన విషాదం..
Also Read : ఇదీ తెలంగాణ అంటే.. అసెంబ్లీలో నిలువెల్లా ప్రజాస్వామ్య స్ఫూర్తి!
2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొండకాలంలో ఓ ప్రవేట్ సంస్థకు గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే దీనికి సంబంధించి అనేక నిజాలు వెలుగులోకి రావడంతో.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసు వేసి గెలిచింది. తద్వారా భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైన సరే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. అంతేకాదు సర్వేలో ఒక్క అంగుళం కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్(సెంట్రల్ యూనివర్సిటీ) దు కాదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు ఈ భూమిలో చేపట్టే అభివృద్ధి ప్రణాళికలో ఎటువంటి చెరువు లేదని.. కొత్తగా చేపట్టే అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదని ప్రభుత్వం పేర్కొంది..” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి ప్రణాళిక స్థానిక సుస్థిరాభివృద్ధి కోసం మాత్రమే. పర్యావరణ అవసరాలకు ప్రభుత్వం అత్యధికంగా ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుత ప్రాజెక్టు ను వ్యతిరేకించే వారంతా రాజకీయ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని” తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీ జీ ఐఐసీ) స్పష్టం చేసింది.
అసలు చరిత్ర ఇది
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో గచ్చిబౌలి ప్రాంతంలో క్రీడా మైదానం నిర్మాణం కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 2300 ఎకరాల నుంచి 40 ఎకరాలు తీసుకున్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు నాడు ఐఎంజి భారత్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదరచుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమిలో మరో 400 ఎకరాలు ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. విద్యార్థులు ఆందోళన చేయడంతో.. గోపన్ పల్లి ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా 400 ఎకరాలు కేటాయించింది.. అయితే గోపనపల్లిలో కేటాయించిన భూమిలో తెలంగాణ ఈస్టిట్యూట్ ఆఫ్ డిమెంటల్ రీసెర్చ్, ఎనిమల్ బయోటెక్నాలజీ రీసర్చ్ కోసం 250 ఎకరాలు కేటాయించారు. అయితే ఈ భూమిలో టీఎన్జీవో కాలనీల కోసం రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే నాడు స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం ఐ ఎం జి భారత్ సంస్థతో చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది. ఐ ఎమ్ జి సంస్థ ప్రాజెక్టు మొదలు పెట్టకపోవడంతో 2006లో నవంబర్ 1న నాటి ప్రభుత్వం జీవో నెంబర్ 111080/ S1/ 2003 ప్రకారం ఆ కేటాయింపును రద్దు చేసింది. ఆ భూమిని ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ కు కేటాయించింది. ఇక దీనిపై నాడు ఐఎంజి భారత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ న్యాయ పోరాటం సుదీర్ఘకాలం సాగింది. ఇక 2024లో హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.. ఇక హైకోర్టు తీర్పును ఐ ఎన్ జి సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే 2024 మే 23న సుప్రీంకోర్టు ఐఎంజి సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఫలితంగా ఆ 400 ఎకరాలు ప్రభుత్వానికి లభించాయి. ఇక ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ 400 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ భూమిని వేలం వేయడానికి రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
Also Read : రేవంత్ ఫైర్.. కేటీఆర్ వైల్డ్ ఫైర్.. అసెంబ్లీలో ఎవరూ తగ్గట్లేదే!