Hardik Pandya : నటాషా తో విడాకులు తీసుకున్న తర్వాత హార్దిక్ పాండ్యా బ్రిటిష్ సింగర్, టీవీనటి జాస్మిన్ వాలియా (Jasmine Walia) తో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్టు ఆ మధ్య జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. వారిద్దరు కూడా విదేశీ పర్యటనకు వెళ్లారని.. దానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు కూడా మీడియాలో ప్రసారమయ్యాయి. అయితే దీనిని హార్దిక్ పాండ్యా ఖండించలేదు. అటు జాస్మిన్ కూడా తప్పు పట్టలేదు. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో ముంబై ఇండియన్స్ సోమవారం రాత్రి మ్యాచ్ ఆడింది. మ్యాచ్ లో బై ఇండియన్స్ విజయం సాధించిన తర్వాత హార్దిక్ పాండ్యాతో కలిసి జాస్మిన్ వాలియా ముంబై ఇండియన్స్ జట్టు బస్సుతో కలిసి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన జాస్మిన్ ముంబై ఇండియన్స్ జట్టు ప్రయాణిస్తున్న బస్సులోకి ఎక్కింది. మీడియా ప్రతినిధులు జాస్మిన్ ఫోటో ప్లీజ్ అని అడిగినప్పటికీ.. ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా బస్సులో కూర్చుంది. అయితే హార్దిక్ పాండ్యా పక్కన కూర్చుందాం? లేదా ఒంటరిగా కూర్చుందా? అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. జాతీయ మీడియాలో అయితే హార్దిక్ – జాస్మిన్ పక్క పక్కన కూర్చున్నారని వార్తలు వస్తే.. లేదు లేదు ఇద్దరు వేరువేరుగా కూర్చున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జాస్మిన్ బస్సులో ఎక్కే వరకే వీడియో కనిపిస్తోంది. ఆమె ఎక్కడ కూర్చుందనే వీడియో మాత్రం కనిపించడం లేదు.
Also Read : MI తో ఓటమే కాదు.. వాంఖడే లోనూ KKR చెత్త రికార్డు!
నటాషా తో విడాకులు తర్వాత..
గత ఏడాది ఇదే సమయానికి హార్దిక్ పాండ్యా – నటాషా మధ్య విడాకుల సంబంధించి మీడియాలో రోజుకొక కథనం ప్రసారమైంది. హార్దిక్ పాండ్యా ఆడిన మ్యాచ్ లు చూసేందుకు నటాషా రాకపోవడంతో వారిద్దరి మధ్య విభేదాలు నిజమేనని అందరూ అనుకున్నారు. టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా నటాషా హార్దిక్ పాండ్యాను అభినందిస్తూ ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో చేయలేదు. పైగా జిమ్ కు వెళ్తున్నప్పుడు వేరే వ్యక్తితో నటాషా కనిపించింది. దీంతో హార్దిక్ కూడా వేరే తోడు వెతుక్కుంటాడని ప్రచారం జరిగింది. దానిని నిజం చేస్తూ అతడు కూడా జాస్మిన్ తో చనువుగా కనిపించాడు. జాస్మిన్ ది భారతీయ మూలాలు ఉన్న నేపథ్యమే. ఇంగ్లీష్ మాత్రమే కాదు హిందీ కూడా జాస్మిన్ అద్భుతంగా మాట్లాడుతుంది. ఆమెకు ఇంగ్లాండ్ దేశంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాటలు కూడా అద్భుతంగా పాడుతుంది. బ్రిటన్ లోని పలు నిర్మాణ సంస్థలు ప్రొడ్యూస్ చేసిన సీరియల్స్ లో జాస్మిన్ నటించింది
Also Read : ముంబై కెప్టెన్‌కు చుక్కలు! హార్దిక్‌పై రూ.12 లక్షల జరిమానా