Telangana : తెలంగాణ(Telangana)లో గ్రూప్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేస్తోంది. వరుసగా గ్రూప్ 1, 2, 3 ఫలితాలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సోమవారం(మార్చి 10న) గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించగా, ఈ పరీక్ష ద్వారా 563 ఖాళీలను భర్తీ చేస్తారు. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను అధిగమించిన అభ్యర్థుల తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
Also Read : ఒక మంత్రికి, ముఖ్యమంత్రికి కేబినెట్ మీటింగ్ లో గొడవట.. బాంబు పేల్చిన బీజేపీ
నేడు గ్రూప్ 2 ఫలితాలు
మంగళవారం(Tuesday) (మార్చి 11, 2025) గ్రూప్ 2 పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా గ్రూప్–2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను కూడా వెల్లడించనున్నారు. గ్రూప్–2లో మొత్తం 783 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించబడింది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
గ్రూప్ 3, ఇతర పరీక్షలు
గ్రూప్–3లో 1,363 పోస్టుల భర్తీకి 2024 నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలను మార్చి 14న విడుదల చేయనున్నారు. అదే విధంగా, మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, మార్చి 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలను వెల్లడించనున్నట్లు TSPSC తెలిపింది. మార్చి 20వ తేదీలోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు..
ఉద్యోగ నియామక(Job Recrutement) ప్రక్రియకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దని TSPSC సూచించింది. పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఫలితాల విడుదలలో ఎలాంటి పొరపాట్లకు తావు లేదని చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే అలాంటి మాటలను నమ్మవద్దని హెచ్చరించారు.
ఫలితాలు చెక్ చేసుకోవడం ఎలా?
అభ్యర్థులు తమ ఫలితాలను TSPSC అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in లో చెక్ చేసుకోవచ్చు. దీని కోసం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేయాలి. ఫలితాలతో పాటు అభ్యర్థుల మార్కులు, ర్యాంకింగ్ జాబితా కూడా అందుబాటులో ఉంటాయి.
Also Read : ఉన్న భూములు అమ్ము.. పథకాలకు ఖర్చు పెట్టు.. తెలంగాణలో ఇదే ఫార్ములా