Ravindra Jadeja : ఏ ముహూర్తం లో డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) ‘పుష్ప 2 : ది రూల్'(Pushpa 2: the Rule) అనే టైటిల్ పెట్టాడో కానీ, అప్పటి నుండి అల్లు అర్జున్(Icon Star Allu Arjun) రూల్ దేశవ్యాప్తంగా మొదలైంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరిని తన మ్యానరిజమ్స్ తో మెంటలెక్కిపోయేలా చేశాడు. ఇప్పుడు నార్త్ ఇండియా లో అల్లు అర్జున్ అనే బ్రాండ్, రాజమౌళి(SS Rajamouli) కంటే పెద్దది. ఆ స్థాయిలో తన చిత్రంతో అందరిని అంతలా ప్రభావితం చేశాడు. ఇది ఇలా ఉండగా ఆదివారం రోజున ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో మన ఇండియా న్యూజిలాండ్ పై ఘనవిజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన దీని గురించే ఇప్పటికీ చర్చ నడుస్తుంది. ఎన్నో ఏళ్ళ తర్వాత మనకు దక్కిన చాంపియన్స్ ట్రోఫీ అది. అయితే గెలిచినా తర్వాత జడేజా(Ravindra Jadeja) పుష్ప మ్యానరిజమ్స్ చేయడం సంచలనంగా మారింది.
Also Read : రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అన్నోళ్ళ నోర్లు.. ఆ నాలుగు పదాలతో మూయించిన జడేజా!
కోట్ల మంది వీక్షిస్తున్న ఒక మ్యాచ్ లో మన తెలుగు హీరోకు సంబంధించి ఇలాంటి మ్యానరిజం చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. అంతే కాదు రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) టీం లో ఒక ముఖ్యమైన ప్లేయర్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. IPL సీజన్ ఈ నెల 23 నుండి మొదలు కానుంది. ఈ సందర్భంగా ఆయన తనని తాను పరిచయం చేసుకుంటూ పుష్ప 2 చిత్రం లోని జైలు సన్నివేశాన్ని స్పూఫ్ చేస్తూ ఒక వీడియోను అప్లోడ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ‘పుష్ప అంటే పేరు కాదు.. పుష్ప అంటే బ్రాండ్’ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ని మార్చి చెప్తూ ‘జడ్డు అంటే పేరు కాదు.. జడ్డు అంటే బ్రాండ్’ అంటూ ఆయన స్టైల్ గా పుష్ప మ్యానరిజమ్స్ చేస్తూ ఒక వీడియో ని చేశాడు.
ఇప్పుడే కాదు గతం లో కూడా ఆయన ‘పుష్ప 1’ కి అల్లు అర్జున్ గెటప్ లో తయారై తన సోషల్ మీడియా లో మాధ్యమాలలో ఒక ఫోటో ని అప్లోడ్ చేయగా, అది అప్పట్లో సంచలనంగా మారింది. చూస్తుంటే రవీంద్ర జడేజా కి పుష్ప క్యారక్టర్ ఒక రేంజ్ లో ఎక్కేసింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. కేవలం జడేజా ఒక్కడే కాదు, పుష్ప లోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని విరాట్ కోహ్లీ కూడా పలు సందర్భాల్లో గతంలో చేశాడు. ఇలా మన తెలుగు హీరో కి సంబంధించిన ఒక మ్యానరిజమ్స్ ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రికెటర్స్ అనుసరించడాన్ని చూస్తుంటే, ఎంతో గర్వంగా ఉంటుంది కదూ. ఇక అల్లు అర్జున్ అభిమానులకు ఏ రేంజ్ హై ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి.
Also Read : అభిమానులకు మరో షాక్.. మరో దిగ్గజ టీమిండియా ప్లేయర్ రిటైర్మెంట్