Dasara Holidays 2024: దసర పండగను తెలుగు రాష్ట్రాలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాయి. ఆడబిడ్డల బతుకమ్మ ఆటాపాటలు, చిన్నాపెద్ద తేడాలేకుండా కొత్తబట్టలు వేసుకొని జమ్మి ఆకులు పంచుకుంటూ అలయ్ బలయ్, రావణ దహనం ఇలా ఎంతో సంబురంగా జరుగుతుంది ఈ మహార్ణవమి, దసర. ఈ పండగకు పిల్లలకు సెలవులు ప్రకటిస్తుంటాయి ఇరు తెలుగు రాష్ట్రాలు. ఈ ఏడాది దసరా వచ్చే నెల అక్టోబర్ 12న వస్తుండటంతో ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి. అంటే అక్టోబర్ మొత్తం సెలవులతో నిండిపోయింది.
ఈ సారి పిల్లలకు మాత్రమే కాదు వారి తల్లిదండ్రులకు కూడా వరుస సెలవులు వస్తున్నాయి. ముఖ్యంగా మల్టి నేషనల్, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పిల్లలతో ఈ సెలవులను ఎంజాయ్ చేసుకోవచ్చు. మరి ఆ సెలువులు ఏంటి? అనే వివరాలు చూసేద్దాం.
తెలంంగాణలో దసరా సెలవులు : తెలంగాణలో దసరా ఘనంగా జరుగుతుంది. ఇది పెద్ద పండగ. ఆడబిడ్డలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. కాబట్టి రాష్ట్రంలోని ప్రతి పట్టణం, పల్లెపల్లెనా దసరా సంబరాలు అంబరాన్ని అంటుతుంటాయి. ఇందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తుంటుంది. ఈసారి పండగకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏకంగా 13 రోజులు సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అక్టోబర్ 15న తిరిగి స్కూల్స్ ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి కూడా ఈ సెలవులు వస్తున్నాయి.
కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు అక్టోబర్ 1న కూడా సెలవు ఇచ్చేందుకు తయారయ్యాయి. అంటే అక్టోబర్ నెలలో సగం రోజులు సెలవులే అన్నమాట. ఈ 15 రోజులు విద్యార్థులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు వివిధ పట్టణాల్లో నివాసం ఉండే విద్యార్థులు స్వంత ప్రాంతాలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో దసరా సెలవులు : ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి చాలా ఘనంగా జరుగుతుంది. ఈ తర్వాత దసరానే మెయిన్. కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా విద్యాసంస్థలకు ఎక్కువగానే సెలవులు ఇస్తుంటుంది. ఈ సారి కూడా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు 10 రోజుల పాటు దసరా సెలవులు ఇవ్వబోతున్నారు. అక్టోబర్ 12న దసరా పండగ కాబట్టి 4వ తేదీ నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 13 వరకు ఈ సెలవులు కంటిన్యూ అవనున్నాయి. అంటే అక్టోబర్ 14 సోమవారం విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయి అని తెలిపింది ప్రభుత్వం. అక్టోబర్ 2న గాంధీ జయంతి. ఈ రోజు ప్రతి ఒక్కరికి హాలీడే. కాబట్టి అక్టోబర్ 3న సెలవు తీసుకుంటే మరో రెండురోజులు కలిసి వస్తాయి… మొత్తం 12 రోజులు దసరా సెలవులు తీసుకున్నట్లు అవుతుంది. దసరా సెలవుల మీద ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
స్కూళ్ళు, కాలేజీలకు దసరా సెలవుల మీద ఓ క్లారిటీ వచ్చింది. దీంతో పిల్లలతో సరదాగా గడిపేందుకు తల్లిదండ్రులకు సమయం కూడా లభిస్తుంది. పిల్లలకు సెలవులు వచ్చినా ఉద్యోగాలు చేసే పేరెంట్స్ కు మాత్రం సెలవులు అసలు ఉండవు. కాబట్టి వారు తమ పిల్లలతో గడపడం కష్టమే. అలాంటి పేరెంట్స్ కు కూడా ఈ దసరా సెలవులు మంచి సంతోషాన్ని ఇస్తాయి. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 6 వరకు అంటే దాదాపు 9 రోజులు పిల్లలతో పాటే ఉద్యోగాలు చేసే పేరెంట్స్ దసరా సెలవులను ఎంజాయ్ చేసుకోవచ్చన్నమాట. కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే పేరెంట్స్ కు పిల్లలతో కలిసి టూర్స్ ప్లాన్ చేసుకోవచ్చు.
మల్టీ నేషనల్, కార్పోరేట్ సంస్థల ఉద్యోగులకు శని, ఆది అని రెండు రోజులు కూడా సెలవులు వస్తాయి. ఇలాంటి వారికి ఈ నెల సెప్టెంబర్ 28,29 రెండురోజులు సెలవే అన్నమాట. ఆ తర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 రెండురోజులు వదిలేస్తే మళ్లీ అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఇది కూడా నేషనల్ హాలిడే. ఆ తర్వాత అక్టోబర్ 3, 4 తేదీలు వదిలేస్తే మళ్లీ వీకెండ్ వచ్చేస్తుంది. అక్టోబర్ 5 శనివారం, ఆక్టోబర్ 6 ఆదివారం కలిసి వస్తుందన్నమాట. మొత్తంగా ఓ నాలుగు రోజులు సెలవు తీసుకుంటే సరిపోతుంది. వరుసగా 9 రోజులపాటు పిల్లలతో పాటే దసరా సెలవులు ఎంజాయ్ చేయవచ్చు.