Telangana Formation Day : ఎన్నో దశాబ్దాల కల నెరవేరిన రోజు. సుదీర్ఘంగా ఉన్న స్వప్నం సాకారమైన రోజు. మొత్తంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడి నేటితో 11 సంవత్సరాలు పూర్తయింది. 65 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర కల 2014 జూన్ రెండున నెరవేరింది. పోరాటల ద్వారా ఏర్పడిన తెలంగాణ నేటితో 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ 12 సంవత్సరాలలో తెలంగాణ ఎన్నో రకాలుగా మార్పులకు గురైంది.. స్వీయ పరిపాలన అందుకుంది. అభివృద్ధిలో.. ఇతర రంగాలలో అనేక మార్పులను చావి చూసింది. దేశంలోనే ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం దాదాపు 65 సంవత్సరాల పాటు వివిధ దశలలో పోరాటాలు జరిగాయి. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 1952 నుంచి 1969 సంవత్సరాల మధ్యలో ఉద్యమాలు జరిగాయి. 1969 నుంచి 2001 వరకు ఉద్యమాలు మరో మలుపు తీసుకున్నాయి. 2001 నుంచి 2014 దాకా తెలంగాణలో తీవ్రస్థాయిలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. 1969 లో తెలంగాణ ఉద్యమం తారస్థాయికి చేరినప్పుడు.. అప్పటి పాలకులు ఆ ఉద్యమాన్ని తొక్కి వేశారు. ఇక ఇదే క్రమంలో 2001లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక తెలంగాణ సాధన ద్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించారు. 2009 తర్వాత ఉద్యమంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చివరికి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయింది.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఎన్నో సంఘటనలు తీవ్రస్థాయిలో మలుపులు తిప్పాయి. ముఖ్యంగా 2009 అక్టోబర్లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి హైదరాబాదులో స్థానిక రిజర్వేషన్లు ఎత్తివేసి.. ఫ్రీ జోన్ గా నిర్ణయించడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. హైదరాబాద్ కనుక ఫ్రీ జోన్ గా మారితే.. ఇక్కడి యువతకు ఉద్యోగాలు లభించవని.. రిజర్వేషన్లు కోల్పోతారని.. అది గతంలో పొందుపరచుకున్న నిబంధనలకు పూర్తి వ్యతిరేకమని నాడు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి.
ఇక నాటి నుంచి ఉద్యమాలు రూపు దాల్చాయి. సకల జనుల సమ్మె.. మిలియన్ మార్చ్.. సాగరహారం.. ఇలా అనేక దశలలో ఉద్యమాలు జరగడం వల్ల తెలంగాణ కల చివరికి సాకారమైంది. ఈ క్రతువులో ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారు. చాలామంది నాటి పరిపాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు. పోలీసుల చేతిలో తీవ్రమైన లాటి దెబ్బలు తిన్నారు. చివరికి స్వరాష్ట్ర సాధన సాధ్యం కావడంతో.. వారంతా ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ధూళిపాల సంవత్సరాలు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ తొలి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. చివరికి 10 సంవత్సరాల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించడంతో.. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభించింది. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది.
Also Read : డబ్ల్యూ డబ్ల్యూఈ పోటీలు వేస్టబ్బా.. మన ఆర్టీసీ బస్సులో ఈ మహిళల ఫైట్ బెస్ట్..