Telangana Corruption Cases: అవినీతి నిరోధక శాఖ వరుస దాడులు చేస్తోంది. అన్ని శాఖల అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నది. భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నది. కేసులు కూడా అదే స్థాయిలో నమోదు చేస్తున్నది. అయినప్పటికీ అధికారులు ఒక లంచాలు తీసుకోవడం మానివేయడం లేదు. పైగా లంచాల కోసం ప్రజలను వేధిస్తున్నారు. తమ పని కోసం వచ్చిన పెద్ద పెద్ద వ్యక్తులను సైతం లంచాలు డిమాండ్ చేస్తున్నారు. చివరికి అవినీతి నిరోధక శాఖ నిర్వహిస్తున్న ఆపరేషన్లలో చిక్కుకుంటున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి నిరోధక శాఖకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇచ్చింది. ఎటువంటి అధికారి అయినా సరే అవినీతి కేసులో ఇరుక్కుంటే తొక్కి నార తీయండి అని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు అత్యంత స్వేచ్ఛగా పనిచేస్తున్నారు.
Also Read: కవిత సీఎం అవుతుందట.. కేటీఆర్ కు ఎసరు పెట్టినట్టే?
ఈ ఏడాది మొదటి నెల నుంచి గడచిన నెల వరకు మొత్తం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకంగా 126 కేసులు నమోదు చేశారు. ఇందులో ట్రాప్ కేసులు ఎనిమిది ఉన్నాయి. ఆదాయానికి మించిన కేసులు ఎనిమిది ఉన్నాయి. క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు 14 ఉన్నాయి. 11 సర్ప్రైజ్ చెకింగ్ లు, డిస్కీట్ ఎంక్వైరీలు మూడున్నాయి. ఈ ఆరు నెలల కాలంలో మొత్తం ఎన్ని మంది ప్రవేటు వ్యక్తులను కలుపుకొని అవినీతి నిరోధక శాఖ అధికారులు మొత్తం 125 మందిని అరెస్టు చేశారు.. వారందరినీ కూడా జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు ట్రాప్ కేసులలోనూ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 27,66,60,526 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు సీజ్ చేశారు. ఇక ఈ ఆరు నెలల కాలంలో 129 కేసులలో తుది నివేదికలను అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపించారు..
క్రితం నెలలో కూడా రోజుకు ఒకటి చొప్పున కేసులు నమోదు కావడం విశేషం. ఆదాయానికి మించిన కేసులు ఇందులో రెండు ఉండగా.. ట్రాప్ కేసులు 15 ఉన్నాయి.. క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు మూడు ఉండగా.. రెగ్యులర్ ఎంక్వయిరీలు నాలుగు ఉన్నాయి.. సర్ప్రైజ్ చెకింగ్ లు ఏడున్నాయి.. ఇక రవాణా శాఖ కార్యాలయాలపై ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టగా.. దాదాపు మూడు కోట్లకు పైగా నగదు పట్టుబడింది. ఇక రవాణా శాఖ కార్యాలయాలపై సోదాలకు సంబంధించిన నివేదికను కూడా అవినీతి నిరతక శాఖ పంపించింది. ఇక గడిచిన నెలలో నమోదు చేసిన 11 కేసులలో తుది నివేదికలను అవినీతి నిరోధక శాఖ అధికారులు సిద్ధం చేసి.. ప్రభుత్వానికి పంపించారు.
Also Read: నిజంగా కేసీఆర్ సాధించాడు.. కాంగ్రెస్ నమ్మాలి.. నడిపించాలి
అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు చేస్తున్నప్పటికీ.. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నప్పటికీ లంచగొండి సిబ్బంది మారడం లేదు. పైగా లంచాల కోసం ప్రజలను వేధిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ మండలంలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారి ఏసీబీ ట్రాప్ లో దొరికిపోయారు. అతడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఆ మండల ప్రజలు రెవెన్యూ కార్యాలయం ఎదుట బాణ సంచా పేల్చడం విశేషం. దీనిని బట్టి ప్రభుత్వాధికారులు ఏ స్థాయిలో లంచాలకు అలవాటుపడ్డారో అర్థం చేసుకోవచ్చు.