Mohan Babu Comments On Prabhas: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) ఈ నెల 27 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ని రెండు నెలల క్రితమే ప్రారంభించాడు మంచు విష్ణు. ఇప్పుడు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడం తో ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్, చిన్న చిన్న ఈవెంట్స్ ని ఏర్పాటు చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. సినిమాని జనాలకు చేరువ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా నిన్న ఆయన గుంటూరు లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోహన్ బాబు(Manchu Mohan Babu) మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. సుమారుగా అరగంట పాటు ఆయన ప్రసంగించాడు. తన పాత అనుభవాలతో పాటు సినిమా గురించి ఎన్నో విశేషాలను ఆయన పంచుకున్నాడు.
Also Read: ఉమ్మడి కరీంనగర్ నుంచే ముగ్గురు మంత్రులా? ఏంటీ చోద్యం?
ఆయన మాట్లాడుతూ ‘దిగువ మధ్యతరగతి కుటుంబం లో పుట్టిన నేను కెరీర్ ఆరంభం లో ఎన్నో కష్టాలు అనుభవించాను. తినడానికి ఆహారం కూడా ఉండేది కాదు. కానీ పైకి ఎదగాలి అనే కసితో కష్టపడి పనిచేసి స్వయంకృషి తో నేడు ఈ స్థానం లో ఉన్నాను. నా జీవిత డిక్షనరీ లో భయం అనే పదానికి చోటు ఇవ్వలేదు. క్రమశిక్షణ తో పెరిగాను, అదే నా విద్యాలయం లో పిల్లలకు కూడా నేర్పించాను. నా విద్యానికేతన్ విశ్వ విద్యాలయం లో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది IAS లు, IPS లుగా మారారు. అదంతా నేను నేర్పించిన క్రమశిక్షణ వల్లే జరిగింది. ‘కన్నప్ప’ చిత్రం ఆ పరమశివుడి అనుగ్రహం తోనే మొదలైంది. ఈ సినిమా పరంగా నేను మొట్టమొదట కృతఙ్ఞతలు చెప్పుకోవాల్సినది ప్రభాస్(Rebel Star Prabhas) కి. ఎదో అతను నా సినిమాలో పని చేశాడని చెప్పడం లేదు కానీ, నిజంగానే ప్రభాస్ ఎంతో ఉన్నతమైన మనసు గల వాడు’.
‘నేను, ప్రభాస్ ప్రేమగా ఒకరిని ఒకరం ‘బావ..బావ అని పిలుచుకుంటూ ఉంటాము. ఒకరోజు నేను ‘కన్నప్ప’ కోసం ఫోన్ చేసి నీతో మాట్లాడాలి ఇంటికి వస్తున్నాను అని అన్నాను. ఇంటికి వెళ్లిన తర్వాత కన్నప్ప స్టోరీ ని వినిపించి ఇందులో కొన్నిరోజులు చేయగల పాత్ర ఉంది. నీకు ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వి, కానీ కన్నప్ప కి నీ కారణంగా ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పాను. అప్పుడు ప్రభాస్ ‘బావ..దీనికోసం నువ్వు ఇక్కడి దాకా రావాలా?, మనం ఈ సినిమా చేస్తున్నాం, మిగతా విషయాలు నేను, విష్ణు మాట్లాడుకుంటాము’ అని అన్నాడు. అదే విధంగా మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి వారు నా మీద ప్రేమతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ప్రభుదేవా నా తమ్ముడిలాంటి వాడు. సాధారణంగా అతను అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళడు, కానీ మా కోసం మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేవాడు’ అంటూ చెప్పుకొచ్చాడు మోహన్ బాబు.