Telangana BJP : బీజేపీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ. అధికారం కోసం, పదవుల కోసం కాకుండా సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు ఉంటారు. కానీ, మోదీ ప్రధాని అయ్యాక దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇందుకోసం బీజేపీ వివిధ పార్టీల్లోని కీలక నాయకులను చేర్చుకుంది. దీంతో పార్టీ సిద్ధాంతం పక్కకుపోయింది. దీంతో పాత కొత్తల కలయిక కొన్ని రాష్ట్రాల్లో పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. తెలంగాణలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇందుకు మొన్న రాజీసింగ్, ఈ రోజు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని హామీ ఇచ్చింది. ప్రధా మోదీ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ చర్చకు దారితీసింది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నేత కె.లక్ష్మణ్, ఇతర రాష్ట్రాల్లో బీసీలను ముఖ్యమంత్రులుగా నియమించిన చరిత్రను గుర్తు చేస్తూ, ఈ హామీని పునరుద్ఘాటించారు. అదే సమయంలో, ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా, దానిని జాతీయ నాయకత్వం ఆమోదించడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Also Read : రేవంత్ కాస్కో.. కవిత ఓపెన్ ఛాలెంజ్!
బీసీ ముఖ్యమంత్రి హామీ..
బీజేపీ తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఈ హామీని పునరుద్ఘాటిస్తూ, బీజేపీ నేత కె.లక్ష్మణ్, ఇతర రాష్ట్రాల్లో బీసీ నేతలను ముఖ్యమంత్రులుగా చేసిన చరిత్రను ఉదాహరణగా చూపారు. ఈ ప్రకటన తెలంగాణలో బీసీ ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో చేసిన రాజకీయ వ్యూహంగా కనిపిస్తుంది, ఎందుకంటే రాష్ట్రంలో బీసీలు జనాభాలో సగానికి పైగా ఉన్నారు. బీసీ ఓటర్లు రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. బీజేపీ ఈ హామీ ద్వారా బీసీ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఈ హామీ నిజమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందా లేక ఎన్నికల వ్యూహంగా మాత్రమే పరిమితమవుతుందా అనేది చర్చనీయాంశం.
రాజాసింగ్ రాజీనామా ప్రభావం..
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను రాష్ట్ర బీజేపీ జాతీయ నాయకత్వానికి పంపింది, దానిని జాతీయ నాయకత్వం ఆమోదించింది. ఈ రాజీనామా బీజేపీలో అంతర్గత ఇబ్బందులను సూచిస్తుంది. రాజాసింగ్ రాజీనామా వెనుక బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశం ఉందా లేక ఇతర రాజకీయ కారణాలు ఉన్నాయా అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ రాజీనామా బీసీ సీఎం హామీతో నేరుగా సంబంధం కలిగి ఉందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: నువ్వయ్యా అసలైన జర్నలిస్ట్ వి.. నిన్ను ఒలంపిక్స్ పంపితే మెడల్ గ్యారెంటీ..
బీజేపీ బీసీ నాయకత్వ చరిత్ర..
కె.లక్ష్మణ్, బీజేపీ ఇతర రాష్ట్రాల్లో బీసీలను ముఖ్యమంత్రులుగా నియమించిన చరిత్రను ఉదహరించారు. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్ సింగ్, బిహార్‌లో నితీష్ కుమార్ (సంబంధిత సమయంలో బీజేపీ మిత్రపక్షం) వంటి బీసీ నేతలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. తెలంగాణలో కూడా బీజేపీ గతంలో బీసీ నేతలైన చలపతిరావు, బండారు దత్తాత్రేయ, బండి సంజయ్‌లను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించింది. అయితే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మాత్రం తాజాగా బీసీకి అధ్యక్ష పగ్గాలు అప్పగించకపోవడాన్ని తప్పు పడుతున్నాయి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ బీసీలపై ‘‘మొసలి కన్నీరు’’ కారుస్తోందని, రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
బీసీ సామాజిక వర్గంపై ప్రభావం..
ఇదిలా ఉంటే.. బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఆ పార్టీలో అంతర్గత ఒత్తిడికి దారితీసినట్లు తెలుస్తోంది.గతంలో బీసీ నేతలైన ఈటల రాజేందర్, డీకే.అరుణ, ధర్మపురి అర్వింద్ వంటి వారిని ప్రముఖ పదవులకు పరిగణించినప్పటికీ, రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం బీసీ నేతను ఎంపిక చేయకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో బీసీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా, తాజాగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ బీసీ ముఖ్యమంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలు అసలు బీజేపీలో ఏం జరుగుతోంది అన్న చర్చకు దారితీశాయి.