Megastar new movie 2025: ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi) కి ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. శ్రీను వైట్ల అసిస్టెంట్ గా ఎన్నో ఏళ్ళు కొనసాగి, ఆ తర్వాత ‘పటాస్’ చిత్రం తో డైరెక్టర్ గా మారి, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్నాడు. అక్కడి నుండి మొదలైన అనిల్ రావిపూడి జైత్ర యాత్ర, సంక్రాంతి వస్తున్నాం సినిమాతో ఎవ్వరూ ఊహించని రేంజ్ కి కొనసాగింది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి తో సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి సిద్ధం అయ్యాడు. రీసెంట్ గానే షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ చిత్రం అప్పుడే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. అనిల్ రావిపూడి సినిమాలకు విడుదలకు ముందు క్రేజ్ ఏర్పడడానికి కారణం, సరికొత్త ఐడియాలతో అతను చేసే ప్రొమోషన్స్ అని చెప్పొచ్చు.
Also Read: రజినీకాంత్ తో సినిమా చేయాలని ట్రై చేసిన తెలుగు స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదలకు ముందు అనిల్ రావిపూడి తన ప్రొమోషన్స్ తో టాలీవుడ్ లో ఒక సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా చూసినా , టీవీ చూసినా ఎక్కడ చూసినా అనిల్ రావిపూడి & టీం నే కనిపించేవాళ్ళు. ఆ రేంజ్ లో ప్రమోట్ చేయబట్టే విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో జరిగాయి. ఇప్పుడు చిరంజీవి(Megastar Chiranjeevi) సినిమాకు షూటింగ్ దశ నుండే సరికొత్త రీతిలో ప్రొమోషన్స్ చేయడం మొదలు పెట్టాడు. నయనతార సెట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న వీడియో ఎంత క్రియేటివ్ గా చేసాడో మనమంతా చూసాము. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టం చూపని నయనతార(Nayanthara), ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొనేలా చేసాడంటే అనిల్ రావిపూడి ఎంతటి అసాద్యుడో అర్థం చేసుకోవచ్చు.
Also Read: ఒక నటుడు స్టార్ హీరో అవ్వాలంటే ఏం చెయ్యాలి… వాళ్ల మూవీ ఎలాంటి సక్సెస్ ను సాధించాలి…
ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఇక సినిమా విడుదల సమయానికి ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో అర్థం చేసుకోవచ్చు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో లాగా, ‘గోదారి గట్టు’ రేంజ్ పాట ఒకటి తగిలితే పాన్ ఇండియన్ సినిమాలతో సమానంగా ఈ సినిమాకు వసూళ్లు వస్తాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మెగా స్టార్ తో చేస్తున్న సినిమా హిట్ అయితే ఈసారి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టొచ్చు. ప్రస్తుతానికి ఈ చిత్రం ప్రాంతీయ భాష చిత్రం గానే తెరకెక్కుతుంది. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా చేస్తారో లేదో చూడాలి. ఇక పోతే ఈ చిత్రం విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. స్వయంగా వెంకటేష్ ఈ విషయాన్ని ప్రకటించాడు కూడా. వచ్చే షెడ్యూల్ లో చిరంజీవి, వెంకీ కాంబినేషన్స్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.