KTR Comment flood video: అధికారంలో ఉన్న పార్టీకి వచ్చేసరికి కూడా పీఠం దక్కాలి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అధికారం లభించాలి. ఈ రెండు పార్టీల అంతిమ లక్ష్యాలు కూడా అధికారం మాత్రమే. అందుకే అధికారం కోసం అధికార పార్టీ తగ్గదు. ప్రతిపక్ష పార్టీ తగ్గాలి అనుకోదు. కాబట్టి ఎవరి పోరాటం వారు చేస్తారు. ప్రజల మన్నన పొందాలని ప్రయత్నిస్తారు. అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధి మంత్రాన్ని జపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుంది..ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సోషల్ మీడియాలో తెలంగాణ సమస్యలను మాత్రమే కాకుండా.. జాతీయ స్థాయి విషయాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఉత్తరాది రాష్ట్రాలలో ప్రస్తుతం విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. అందులో హర్యానా రాష్ట్రంలోని గుర్ గ్రామ్ కూడా ఒకటి. ఈ ప్రాంతంలో వర్షాలు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు మొత్తం జలమయంగా మారాయి. డ్రైనేజీ నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో వరద నీరు నిల్వ ఉంటున్నది.. ఫలితంగా ప్రజలు నరకం చూస్తున్నారు. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతున్న నేపథ్యంలో అవస్థలు పడుతున్నారు. ఇదే విషయాన్ని ఓ మీడియా సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. ఫీల్డ్ లెవల్లో రిపోర్టర్ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో అక్కడి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాడు. నిల్వ ఉన్న వరద నీటిలో అతడు ఈత కొట్టుకుంటూ.. ఒక చేతితో టీవీ లోగో పట్టుకుంటూ అక్కడి పరిస్థితిని వెల్లడించే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి అతని రిపోర్టింగ్ ను మెచ్చుకోవాలి. సమస్య తీవ్రతను అధికారులకు వెల్లడించడానికి అతడు చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తోంది. ఇదే వీడియోను భారత రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
Also Read: మోడీని దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ హింట్ ఇచ్చాడా? ప్రధానిని దించడం సాధ్యమేనా?!
ఈ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన విలేఖరిని కచ్చితంగా ఒలింపిక్స్ పంపించాలని.. ఈత కొట్టే విభాగంలో పోటీలకు భారతదేశం తరఫున పంపిస్తే ఖచ్చితంగా మెడల్ వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గురుగ్రామ్ లో ఉన్న పరిస్థితిని ఇతడు నూటికి నూరు శాతం బయట ప్రపంచానికి తెలిసేలా చేశాడని కేటీఆర్ అభినందించారు. ఇతడు ఇతడు అద్భుతమైన నైపుణ్యం చూపిస్తున్న నేపథ్యంలో ఒలంపిక్స్ పోటీలకు పంపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేటీఆర్ అభ్యర్థించారు . ఇటీవల కాలంలో ప్రజా సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కేటీఆర్.. చాలా రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాకపోతే తనదైన శైలిలో సెటైరికల్ గా వీడియోతో సమస్యను ప్రస్తావించారు. చాట భారతం కాకుండా..రెండంటే రెండు ముక్కల్లోనే కేటీఆర్ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే దీనిపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక విధంగా.. భారత రాష్ట్ర సమితి నాయకులు మరొక విధంగా స్పందిస్తున్నారు. కేటీఆర్ చేసిన ట్వీట్ ద్వారా రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు పరస్పరం దూషణలకు దిగుతున్నారు.
Send this reporter to olympics Modi Ji
Never seen these kind of amazing skills of being able to report a story while swimming https://t.co/V8RKUfKdFU
— KTR (@KTRBRS) July 10, 2025