Pawan Kalyan Birthday Celebrations: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పుట్టిన రోజు నిన్న ఎంత గ్రాండ్ గా జరిగిందో మనమంతా చూశాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఒక పండుగలాగా జరిపించారు. అభిమానులు జీవితాంతం గుర్తించుకోదగ్గ సెలబ్రేషన్స్ ఇవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులూ కూడా శుభాకాంక్షలను వెల్లువ లాగా కురిపించారు. ‘#HBDPawanKalyan’ అనే ట్యాగ్ పై నిన్న 1 మిలియన్ కి పైగా ట్వీట్స్ పడ్డాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్ లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి అనేది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వంటి వారితో పాటు కేంద్ర ప్రభుత్వం లో ఉన్న ప్రతీ మంత్రి, ఎంపీ పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పవన్ కళ్యాణ్ గురించి పెట్టిన ఎమోషనల్ శుభాకాంక్షలు పెద్ద హైలైట్ గా మారింది.
ఇదంతా పక్కన పెడితే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్S(Shivarajkumar) నిన్న తన నివాసం లో పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి, పవన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. గతంలో ఎన్నో సందర్భాల్లో శివ రాజ్ కుమార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ఇలాగే పాల్గొని, వాళ్ళ అభిమానులతో కలిసి కేక్ కట్ చేశాడు. ఆయన తమ్ముడు, దివంగత పునీత్ రాజ్ కుమార్ కూడా ఎన్నోసార్లు ఇలా చేశాడు. మెగాఫ్యామిలీ అంటే ఈ కుటుంబానికి ఎనలేని ప్రేమ అని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ మరొకటి లేదు. నిన్న తన పై శివ రాజ్ కుమార్ చూపించిన ప్రేమకు పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యి ఒక ట్వీట్ వేశాడు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈరోజు నా అభిమానులతో కలిసి నా పుట్టినరోజు వేడుకలను జరిపి కేక్ కట్ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆయన సింప్లిసిటీ కి ఉన్నతమైన మనస్సుకి ఇది తార్కాణం. ఆ సుబ్రమణ్య స్వామిని శివ రాజ్ కుమార్ గారికి నిండు నూరేళ్ళ ఆరోగ్యవంతమైన ఆయుశ్హుని ప్రసాదించి, తనని అభిమానించే కోట్లాది మంది అభిమానులను, అద్భుతమైన పాత్రలతో అలరిస్తూనే ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. దీనికి శివ రాజ్ కుమార్ స్పందిస్తూ ‘గత కొన్నేళ్లుగా మీ అభిమానులతో కలిసి ఇలా మీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్నాను. వాళ్ళ ప్రేమాభిమానాలే మీకు బలం, పుట్టిన రోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎప్పటిలాగానే లక్షలాది మంది అభిమానులకు ఆదర్శంగా నిలుస్తూ, ఇలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ముందుకు వెళ్లాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
If me being a part of their celebrations gives them happiness, then I’d do it many times over. Their love for you will always be your strength. Wishing you a very Happy Birthday @PawanKalyan avare. Keep growing, Keep Inspiring, God Bless You! https://t.co/jldjXHsd31
— DrShivaRajkumar (@NimmaShivanna) September 2, 2025