Revanth Diwali celebrations: తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఒక రాజకీయ ఆసక్తికర పరిణామం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( Telangana CM Revanth Reddy ) ఇంట్లో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ప్రత్యక్షమయ్యారు. దీపావళి పండుగ సందర్భంగా టిడిపి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ గ్రీష్మ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సతీ సమేతంగా రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన బొజ్జల సుధీర్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు సుధీర్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
టిడిపి తో సంబంధాలు
రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) కొనసాగారు. ఆ పార్టీలో ముఖ్య నేతగా ఎదిగారు. తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగాను పనిచేశారు. ఏపీ టీడీపీలోని సీనియర్ నేతలు అందరితోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి ఈ క్రమంలోనే టిడిపి సీనియర్ నేతగా ఉన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తో సైతం మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. గోపాల కృష్ణారెడ్డి మరణం తర్వాత ఆయన వారసుడిగా తెరపైకి వచ్చారు సుధీర్ రెడ్డి. మొన్నటి ఎన్నికల్లో సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి గెలిచారు. తండ్రి మాదిరిగా రేవంత్ రెడ్డి తో సుధీర్ రెడ్డికి సైతం మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో దీపావళి పండుగను పురస్కరించుకొని రేవంత్ రెడ్డి నివాసానికి సతీసమేతంగా వెళ్లి మరి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారింట్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ గ్రీష్మ సైతం
మరో టిడిపి ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ( TDP MLC grishma ) సైతం రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె సీనియర్ నాయకురాలు, ఏపీ అసెంబ్లీలోని తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె. మొన్నటికి మొన్న ఆమె ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. శాసనమండలిలో సైతం గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. ప్రతిభాభారతితో రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రీష్మ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. వారింట్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఎక్కువగా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ముఖ్య మంత్రి వర్యులు “@revanth_anumula ” గారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు
దీపావళి పండుగ సందర్బంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి స్వగృహం లో కలిసి శుభాకాంక్షలు తెలిపి దీపావళి వేడుకలలో పాల్గొన్న శ్రీకాళహస్తి… pic.twitter.com/9pRvxgZY6A
— Bojjala Sudhir Reddy (@BojjalaSudhir) October 21, 2025