K Ramp Producer Rajesh Danda: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరో గా నటించిన ‘k ర్యాంప్'(K ramp) చిత్రం రీసెంట్ గా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ వైపు దూసుకుపోతోంది. అయితే ఈ చిత్రం విడుదల రోజు కొన్ని వెబ్ సైట్స్ నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం పై ఆ చిత్ర నిర్మాత రాజేష్ దందా సక్సెస్ మీట్ లో ఒక రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఇప్పుడు ఈయన చేసిన కామెంట్స్ తిరుగుతున్నాయి. మరోపక్క ఆయన గతం లో నిర్మాత కాకముందు ట్విట్టర్ లో చేసిన కొన్ని కామెంట్స్ ని మళ్లీ పైకి తీసి కొంతమంది నెటిజెన్స్ రాజేష్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన గతంలో వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఆయన ఒక మీడియా రిపోర్టర్ పై ఫైర్ అవ్వడం తో మీడియా మొత్తం ఏకమై రాజేష్ పై విరుచుకుపడింది.
దీంతో రాజేష్ కాసేపటి క్రితమే వివరణ ఇస్తూ ఒక ట్వీట్ వేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్ సైట్ పట్ల, ఆ వెబ్ సైట్ నిర్వాహకుల పట్ల, పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతగా ఓ సినిమా తీసాను. తెలుగు 360 వెబ్ సైట్ దానిని సమీక్షించి, దానికో రేటింగ్ ఇచ్చింది. అంత వరకు నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ సినిమాను జనం ఆదరిస్తున్నారు. ఆ విధంగా సినిమా హిట్ అయితే ఆ సైట్ సమీక్షల క్రెడిబులిటీ పోతుంది. అందుకే వాళ్ల రేటింగ్ ను నిలబెట్టుకోవాలని నా సినిమా మీద నెగిటివ్ పోస్ట్ లు, నెగిటివ్ వార్తలు వేయడం ప్రారంభించారు’ అంటూ తన ఆవేదన చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘గతంలో మ్యాడ్ 2 సినిమా విషయంలో ఇంకో వెబ్ సైట్ ఇలాగే చేస్తే, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు. అప్పుడు కూడా ఆయన చెప్పారు. మా మీద ఆధారపడి వెబ్ సైట్ లు నడుపుతూ ఇలా చేయడం తప్పు అని చెప్పారు. ఇప్పుడు నేనూ అదే చెబుతున్నాను. అయితే నేను వాడిన భాష అభ్యంతరకరం అని అంటున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నా సినిమాను చంపేస్తూ, నాకు కోట్ల నష్టం కలిగించే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా..నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడాను. అంతకు మించి మరే మీడియా సంస్థ మీద, మరే మీడియా వ్యక్తి మీద నాకు ఏ కోపం లేదు. పైగా 150 మందికి పైగా వున్న సినిమా జర్నలిస్ట్ లు, సోషల్ మీడియా జనాలు, మీమర్స్ అందరూ నాకు అత్యంత సన్నిహితులే. వారంటే నాకు ఎప్పుడూ గౌరవం వుంటుంది. నా బాధ, కోపం లో వచ్చిన భాషను సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను నా యుద్దం మీడియా మీద కాదు మీడియా ముసుగు లో సినిమా లను చంపుతున్న తెలుగు 360 వెబ్ సైట్ మీద’ అంటూ చెప్పుకొచ్చాడు.
మీడియా మిత్రులకు, మీడియా సంస్థలకు విన్నపం.
నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్ సైట్ పట్ల, ఆ వెబ్ సైట్ నిర్వాహకుల పట్ల, పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది. కోట్లు ఖర్చు…
— Razesh Danda (@RajeshDanda_) October 22, 2025
SIDPA condemns Telugu producer Razesh Danda’s abusive remarks toward a media outlet.
Threats, insults, or intimidation of journalists are unacceptable and punishable by law. #SIDPA #SouthIndiaDigitalPublishersAssociation pic.twitter.com/oA0MgnKKr2
— South India Digital Publishers Association (@SouthIDPA) October 22, 2025