TCS Incident: టీసీఎస్‌లో ఉద్యోగాలు ఆశ చూపి పేద, మధ్య తరగతి యువతులను లవ్‌జిహాల్ పేరుతో వేధించడం, లైంగికంగా వాడుకోవడం, మతం మారాలని ఒత్తిడి చేయడం వంటి విషయాలు గత నెలలో ఆధారాలతో సహా వెలుగు చూశాయి. పోలీసులు ఈ గుట్టు రట్టు చేశారు. 8 బాధిత యువతుల ఇందులో ఉన్నట్లు నిర్దారించారు. ఇక ఇందులో ప్రధాన నింధితురాలు హెచ్‌ఆర్ మహిలే. కొందరు ఉద్యోగులు ఉన్నారు. అయితే ఈ ఉదంతంపై పెద్దగా స్పందించిన రాజకీయ పార్టీలు కానీ, సంఘాలు కానీ లేవు. కానీ, తాజాగా బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విషయంలో మాత్రం తెలంగాణలో కొన్ని సంఘాలు, కొంతమంది నాయకులు అతిగా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
బండి సంజయ్ కుమారుడి కేసు..
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై ఫోక్సో కేసు నమోదైంది. హైదరాబాద్ మెట్రోలో పోస్టర్లు, ఉద్యమాలు ఊపందుకున్నాయి. యువతితో సహవాసం సహజమే, కానీ మైనర్‌తో లైంగిక బంధం మాత్రం నేరం. దీనిపై విచారణ జరగాలి. వాస్తవాలు తెలియాలి. భగీరథ్‌కు మద్యపాన అలవాటు తీవ్ర లోపాలు ఉన్నాయన్నది అర్థమవుతోంది.
ద్వంద్వ వైఖరి..
టీసీఎస్‌లో మత స్వేచ్ఛా ఉల్లంఘనలు మర్చిపోతూ, బండి కేసులో రొడ్డెక్కడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజేపీ నేత కుమారుడిపై దాడి రాజకీయ లీకేజీలా కనిపిస్తోంది. ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ సమాజంలో విభేదాలను పెంచుతాయి. మైనర్ సురక్షణ, మత హక్కులు సమానంగా కాపాడాలి.
చట్టం అందరిపై సమానంగా అమలవ్వాలి. పోలీసులు టీసీఎస్ దర్యాప్తును వేగవంతం చేయాలి. పోక్సో కేసుల్లో త్వరిత నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయులు కుటుంబ సమస్యలను సరిదిద్దుకుని, సామాజిక బాధ్యతలు నెరవేర్చాలి.