MLC Kavita : ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్.. అంత పూచికత్తు చెల్లించాల్సిందే.. నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే..

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం మంజూరు చేసింది..ఎన్ ఫోర్స్ మెంట్, సీబీఐ కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 27, 2024 3:27 pm

MLC Kavitha

Follow us on

MLC Kavita : 165 రోజులుగా ఢిల్లీలోని తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. దాదాపు 165 రోజుల తర్వాత కవిత జైలు నుంచి విడుదల కానున్నారు.. ఈ క్రమంలో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. ఆమెకు అనేక షరతులు విధించింది. “ఢిల్లీ మద్యం కుంభకోణంలో దర్యాప్తు పూర్తయింది.. చార్జ్ షీట్ కూడా దాఖలయింది. ఈ క్రమంలో కవితను విచారణ ఖైదీగా జైల్లో ఉంచడం సరికాదు. సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయంలో సరికాదు అనిపిస్తోంది. సెక్షన్ 45 అనేది దుర్బల మహిళలకు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు జడ్జి వ్యవహరించాలని మండిపడింది. కోర్టులు సెక్షన్ 45 విషయంలో సున్నితంగా వ్యవహరించాలని హితవు పలికింది. ఒక మహిళ అక్షరాస్యురాలు అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ ఎందుకు నిరాకరిస్తారని” సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది..

కవిత ఈ నిబంధనలు పాటించాల్సిందే

బెయిల్ లభించిన అనంతరం ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు అనేక నిబంధనలు విధించింది. కవిత తన పాస్ పోర్ట్ ను మెజిస్ట్రేట్ కు అప్పగించాలి. కోర్టు అనుమతితోనే విదేశాలకు వెళ్లాలి. కోర్టు ఒప్పుకోకుంటే ఆమె విదేశాలకు వెళ్లకూడదు. కేసు ట్రయల్ జరుగుతున్నప్పుడల్లా ఆమె సహకరించాలి. విచారణ సమయంలోనూ దర్యాప్తు సంస్థలకు సహకరించాలి.

దాని ప్రకారమే బెయిల్

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ లోని సెక్షన్ 45 ప్రకారం కవిత కు సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ కె వి విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ కేసులో దర్యాప్తు ముగిసిందని.. విచారణకు ముగిసే వరకు చాలా కాలం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆమె జైల్లో ఉండాల్సిన అవసరం లేదని.. అందువల్లే బెయిల్ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది.. ఇదే సమయంలో అటు కవిత తరపు న్యాయవాదులకు, ఇటు ఎన్ ఫోర్స్ మెంట్, సీబీఐ తరపు న్యాయవాదులకు సుప్రీంకోర్టు ధర్మాసనం చురకలు అంటించింది.. “కవిత దుర్బల మహిళ అని మీరు ఎలా అంటారు? ఈ కేసు తేలడానికి చాలా సమయం పడుతుంది. అప్పటిదాకా కవిత జైల్లో ఉండాల్సిన అవసరంలేదని” సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర దర్యాప్తు సంస్థలతో వ్యాఖ్యానించింది..” ఫోన్లు తరచూ మారుస్తుంటారా? అరుణ్ ఇప్పటికే తన స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారు కదా? కవిత సామాన్యమైన మహిళ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ” అని సుప్రీంకోర్టు ధర్మాసనం కవిత తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇలా రెండు వర్గాలను తలంటిన తర్వాత బెయిల్ మంజూరు చేసింది.