https://oktelugu.com/

Ram Pothineni: మహేష్ బాబు చేతుల్లోకి హీరో రామ్ సినీ కెరీర్..తేడా కొడితే ఇదే చివరి సినిమా..?

రామ్ సరైన స్క్రిప్ట్స్ ఎంపిక రాకపోవడం వల్ల ఆయన కెరీర్ లో హిట్స్ కంటే ఎక్కువగా ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. 'ఇస్మార్ట్ శంకర్' వంటి భారీ బ్లాక్ బస్టర్ తో లైన్ లోకి పడ్డాడు అని ఆయన అభిమానులు అనుకునేలోపు వరుసగా 'ది వారియర్', 'స్కంద', 'డబుల్ ఇస్మార్ట్' వంటి ఫ్లాప్స్ తో కెరీర్ ని రిస్క్ లో పారేసుకున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 27, 2024 / 03:28 PM IST

    Ram Pothineni

    Follow us on

    Ram Pothineni: ‘దేవదాసు’ చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసి, మొదటి చిత్రంతోనే ఎవరీ కుర్రాడు, ఇంత అద్భుతంగా నటించాడు, ఇంత చలాకీగా డ్యాన్స్ చేస్తున్నాడు, అదరగొట్టేసాడుగా అని ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసిన హీరో ఎనెర్జిటిక్ స్టార్ రామ్. అప్పట్లో ఈ కుర్ర హీరో దూకుడు ని చూసి కచ్చితంగా స్టార్ హీరోల లీగ్ లోకి చేరిపోతాడని అందరూ అనుకున్నారు. ‘దేవదాసు’ చిత్రం తర్వాత విడుదలైన ‘జగడం’ చిత్రం ఫ్లాప్ అయ్యినప్పటికీ, ఆ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెడీ’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఆ తర్వాత ‘మస్కా’, ‘కందిరీగ’, ‘నేను శైలజ’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రెడ్’ వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ చిత్రాలతో యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి ని సంపాదించుకున్నాడు.

    కానీ రామ్ సరైన స్క్రిప్ట్స్ ఎంపిక రాకపోవడం వల్ల ఆయన కెరీర్ లో హిట్స్ కంటే ఎక్కువగా ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తో లైన్ లోకి పడ్డాడు అని ఆయన అభిమానులు అనుకునేలోపు వరుసగా ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి ఫ్లాప్స్ తో కెరీర్ ని రిస్క్ లో పారేసుకున్నాడు. ‘స్కంద’ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా వసూళ్ల పరంగా పర్వాలేదు అనిపించాయి. ‘ది వారియర్’ చిత్రానికి కూడా యావరేజ్ రేంజ్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘డబుల్ ఇస్మార్ట్’ శంకర్ మాత్రం జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని కనీసం 20 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది . ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా రామ్ కెరీర్ ని డేంజర్ జోన్ లోకి నెట్టేసింది. ఇప్పుడు అర్జెంటు గా ఆయనకి ఒక సూపర్ హిట్ కావాలి. ప్రస్తుతం ఆయన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ చిత్ర దర్శకుడు పి.మహేష్ బాబు దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా మీదనే ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. మొదటి సినిమాతోనే మహేష్ బాబు దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సరికొత్త ఆలోచనతో తీసిన ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం థియేటర్ ఆడియన్స్ తో పాటు , ఓటీటీ ఆడియన్స్ ని కూడా విశేషం గా ఆకట్టుకుంది.

    ఇప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలు చెయ్యడం వల్లే రామ్ కి వరుస ఫ్లాప్స్ వచ్చాయి. ఇలా కొత్త రకంగా ఆలోచించే దర్శకులతో ఆయన సినిమా చేస్తే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇందులో రిస్క్ కూడా ఉంది, కొత్త తరహా కాన్సెప్ట్స్ కి ఎంటర్టైన్మెంట్ లేకపోతే దారుణమైన డిజాస్టర్స్ గా మిగులుతున్నాయి. అలా ఈ చిత్రం ఉంటే రామ్ మార్కెట్ పూర్తిగా దెబ్బ తింటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై రామ్ ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొని ఎంటర్టైన్మెంట్ కచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ఒక సినిమా పూర్తి అయిన వెంటనే మరో సినిమా షూటింగ్ ని ప్రారంభించే అలవాటు ఉన్న రామ్, ఈసారి బాగా టైం తీసుకోనున్నాడు.