HomeతెలంగాణCM Revanth Reddy: కేసీఆర్ తో పోల్చుకుంటే.. రేవంత్ పై అసంతృప్తి.. ఆర్కే అంత పెద్ద...

CM Revanth Reddy: కేసీఆర్ తో పోల్చుకుంటే.. రేవంత్ పై అసంతృప్తి.. ఆర్కే అంత పెద్ద బాంబు పేల్చాడేంటి?

CM Revanth Reddy: చంద్రబాబు విషయం మీద ఇస్తే మిగతా అందరి రాజకీయ నాయకుల పై రాధాకృష్ణ ఒంటి కాలు మీద లేస్తాడు. నచ్చితే మెచ్చుకుంటాడు.. నచ్చకపోతే తిట్టుకుంటాడు. రేవంత్ విషయంలోనూ కాస్త మెతక వైఖరి ప్రదర్శిస్తున్నప్పటికీ.. కొన్ని కొన్ని విషయాలలో రాధాకృష్ణ ఓపెన్ గానే నిజాలు చెప్పేస్తున్నాడు. తాజా కొత్త పలుకులు రేవంత్ ఏడాది పరిపాలనపై రాధాకృష్ణ అంత సంతృప్తిగా ఉన్నట్టు కనిపించలేదు. కెసిఆర్ ఫస్ట్ టర్మ్ పరిపాలనతో పోల్చితే రేవంత్ ఊహించిన అంత స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పేశాడు..” కెసిఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు అన్ని వ్యవస్థల మీద పట్టు కలిగి ఉండేవాడు. ఎమ్మెల్యేలను, ఇతర ప్రజా ప్రతినిధులను క్రమశిక్షణతో ఉండమనేవాడు. అందువల్ల కేసీఆర్ పై జనాలలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏర్పడింది. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది కోల్పోయింది. జనాల మీదికి ఎమ్మెల్యేలను, అధికారులను ఇష్టానుసారంగా వదిలిపెట్టాడు. ఫలితంగా జనాలలో వ్యతిరేకత ఏర్పడింది. అంతిమంగా అధికారాన్ని కోల్పోయేలా చేసిందని” రాధాకృష్ణ రాసుకొచ్చాడు. కెసిఆర్ ఫస్ట్ టర్మ్ పరిపాలనతో బేరిజు వేసుకుంటే రేవంత్ పరిపాలన ఆశాజనకంగా లేదని రాధాకృష్ణ చెప్పేశాడు.

అలవి కాని హామీలు

కెసిఆర్ రెండో టర్మ్ పరిపాలన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని.. అలవి కాని హామీలు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని రాధాకృష్ణ చెప్పేశాడు..”పాత పథకాలు పక్కన పెట్టడం.. కొత్త పథకాలకు రూపకల్పన చేయడం వల్ల.. జనాలు అంతగా సంతృప్తిగా లేరు.. అలాగని రేవంత్ పై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం కావడం లేదు. అసంతృప్తి మాత్రం ఉంది. పాత పథకాలు కొనసాగిస్తూ.. కొత్త వాటిని ప్రవేశపెడితే ప్రజల హర్షిస్తారు. హైడ్రా, మూసి ప్రక్షాళన ఏకకాలంలో చేపట్టడం వల్ల ప్రజల్లో అపోహలు చెలరేగాయి. శ్రీమంతుల వ్యవసాయ క్షేత్రాలను కూల్చివేసినప్పుడు ప్రజల నుంచి ఆమోదం లభించింది. ఆ తర్వాత మధ్యతరగతి వారి గృహాలపై హైడ్రా పడిపోయి కూలగొట్టడంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన క్షణాలలోనే అద్భుతాలు జరగవు. ఆ విషయాన్ని రేవంత్ గుర్తించాలని” రాధాకృష్ణ ఓపెన్ గానే రాశాడు..

భాష విషయంలో

ఇటీవలి కొత్త పలుకులో రేవంత్ భాష పై సుత్తిమెత్తని చురకలు అంటించిన రాధాకృష్ణ.. ఈ ఆదివారం కొత్త పలుకులోను కాస్త గట్టిగానే హెచ్చరించాడు “కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి నోరు జారతాడు.. నువ్వొక ముఖ్యమంత్రివి కదా.. ఆ హుందాతనాన్ని ప్రదర్శించాలి కదా.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడితే ఎలా? ప్రజలు అన్ని గమనిస్తుంటారు.. జాగ్రత్త.. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేటీఆర్ లో అసహనం పెరిగిపోయింది. అందువల్లే సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా వాడు వీడు అని మాట్లాడుతున్నాడని” ఆర్కే రాసేశారు. ఇక ఏపీ రాజకీయాల విషయంలోనూ తనదైన మార్క్ విశ్లేషణ ప్రదర్శించారు. అదానితో కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో వెనకడుగు వేయొద్దని.. జగన్ ను గట్టిగానే శిక్షించాలని చంద్రబాబుకు సూచించారు. ఏపీలో సూపర్ సిక్స్ పథకాలను ఇంకా పూర్తిస్థాయిలో అమలు చేయని విషయంపై ఆర్కే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై వీసమెత్తు వ్యాఖ్య కూడా చేయలేదు.. ఇదే సమయంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పేశారు. అంటే జాకెట్ యాడ్స్ ఇస్తున్నప్పటికీ కూడా రాధాకృష్ణ కు రేవంత్ పై ఎందుకంత కోపమో కాంగ్రెస్ శ్రేణులకు అంతుపట్టడం లేదు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular