CM Revanth Reddy: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. మరో 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. కేవలం మూడేళ్లలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి.. అధికారంలోకి తెచ్చాడన్న క్రెడిట్ రేవంత్‌కు ఉంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా సీఎంగా ఆయననే ఎంపిక చేసింది. ఇక రేవంత్ కూడా ప్రమాణం చేసిన రోజు నుంచే పాలనలో దూకుడు చూపుతున్నారు. సాయంత్రం కేబినెట్, మరుసటి రోజు ప్రజాదర్బార్, సాయంత్రం ఢిల్లీకి, తర్వాతి రోజు అసెంబ్లీ సమావేశం, ఆ తర్వాతి రోజు యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు పరామర్శ ఇలా అన్నీ చకచకా చేస్తున్నారు. ఇదే సమయంలో సలహాదారులు, నామినేటెడ్ పోస్టులను రద్దు చేశారు. అయితే ఆదివారం యశోద ఆస్పత్రి వద్ద చోటుచేసుకున్న సంఘటనపై సోషల్ మీడియాలో రచ్చ అవుతోంది.
ఏం జరిగిందంటే..
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించేందుకు సీఎం రేవంత్.. ఆదివారం మధ్యాహ్నం యశోద ఆస్పత్రికి వెళ్లారు. పరామర్శించారు. మాట్లాడారు. తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తర్వాత ఇంటికి వెళ్తుండగా, పక్కనుంచి రేవంతన్న అన్న పిలుపు వినిపించింది. వెంటనే అటవైపు చూసిన రేవంత్.. తనను పిలిచిన మహిళ వద్దకు వెళ్లారు. ఏం సమస్య ఉందని అడిగి తెలుసుకున్నారు. తన పిల్లల వైద్యం ఖర్చు ఎక్కువ అవుతుందని సదరు మహిళ తెలుపగానే.. వెంటనే పరిష్కరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఇదంతా స్క్రిప్టెడ్ వీడియో అని ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు.
పీఆర్ వీడియో అని..
సామాన్యురాలు పిలిస్తే.. సీఎం వెంటనే ఆమె వద్దకు వెళ్లారని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుండగా, దానికి కౌంటర్‌గా మరో వీడియో వైరల్ అవుతోంది. రేవంత్‌కు అనుకూలంగా అవుతున్న వీడియో పూర్తిగా పీఆర్ వీడియో అని అంటున్నారు. సునీల్ కనుగోలు స్క్రిప్ట్ అయి ఉంటుందని అంటున్నారు. ఇంత పీఆర్‌ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి వారం కాకముందే.. ఇలాంటి చీప్ ట్రిక్ పాలిటిక్స్ మంచిది కాదంటున్నారు. ప్లాన్డ్‌గా చేసినట్లు వీడియో చూడగానే అర్థమవుతోంది. కావాలనే ఇలా చేశారని తెలుస్తోంది.
భజనలు పక్కన పెట్టాలి..
పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నేపథ్యంలో పాలన సాఫీగా సాగించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అలా కాకుండా భజనకు ప్రాధాన్యం ఇస్తే నష్టపోతారని సూచిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ముంచింది ఇలాంటి అంశాలే అని పేర్కొంటున్నారు. ప్రజా పాలన అందించాలని, క్షేత్రస్థాయిలో ఏం జరుగతుందో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. భజన పరులను దూరం పెట్టాలని అంటున్నారు. అయితే కొంతమంది ఇది బాధితురాలే తీసిన వీడియో అయి ఉంటుందని కూడా కొంతమంది అంటున్నారు. వాస్తవం ఏంటో తెలియాలి అంటే.. ప్రభుత్వం లేదా కాంగ్రెస్ నాయకుల స్పందించాలి.
రేవంతన్న.. డ్రామాలు అన్నీ ఇన్నీ కావు..
ఇది మాములు కామెడీ కాదు.. pic.twitter.com/0mJNFSLex2— News Line Telugu (@NewsLineTelugu) December 11, 2023