https://oktelugu.com/

Smita Sabharwal : బ్యూరోక్రాట్లకు సోయి ఉండాలి.. అది అదుపు తప్పితే ఇదిగో స్మితా సబర్వాల్ లాగే మాట్లాడుతుంటారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్మితా సబర్వాల్ ను లూప్ లైన్ లో పెట్టారు. అయితే అప్పట్నుంచి ఆమె సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. గతంలో ఆమె ఎక్కువగా రీల్స్ చేసి వార్తల్లో వ్యక్తిగా ఉండేవారు. అప్పటి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనుల వద్ద రీల్స్ చేసి.. పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వానికి సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఆ రీల్స్ ఆమె పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ నాయకులు తప్పు పట్టారు

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 22, 2024 4:18 pm
    Follow us on

    Smita Sabharwal నరం లేని నాలుక ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది. అవి మంచి కైతే పెద్దగా అభ్యంతరం ఉండదు. ఆ మాటలు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తేనే చిక్కులు ఎదురవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే తెలంగాణ ప్రభుత్వంలో సీనియర్ అధికారి, ఒకప్పుడు కేసీఆర్ ఏలుబడిలో సీఎం వల్ల చక్రం తిప్పిన స్మితా సబర్వాల్ ఎదుర్కొంటున్నారు.. స్మితా సబర్వాల్ కెసిఆర్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా పని చేశారు. మంచి గౌరవాన్ని పొందారు. అప్పట్లో ఎవరో వ్యక్తి ఆమె ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసినప్పుడు తెలంగాణ సమాజం ఆమె వైపు బలంగా నిలబడింది. ఆమె ఓ ఫ్యాషన్ పరేడ్ లో పాల్గొనదని ఓ మీడియా అడ్డగోలుగా రాసింది. అప్పుడు కూడా తెలంగాణ సమాజం ఆమెను ఓన్ చేసుకుంది. తనకు వ్యతిరేకంగా అడ్డగోలుగా రాసిన మీడియాపై న్యాయపోరాటానికి కూడా తెలంగాణ ప్రభుత్వం ఖర్చులు చెల్లించింది. అంతటి ప్రయారిటీ పొందిన ఆమె ఇప్పుడు సోయి తప్పినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో దివ్యాంగులపై ఏదో వివాదాస్పద ట్విట్ చేసింది. అది తీవ్రమైన చర్చకు దారితీస్తోంది.

    రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్మితా సబర్వాల్ ను లూప్ లైన్ లో పెట్టారు. అయితే అప్పట్నుంచి ఆమె సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. గతంలో ఆమె ఎక్కువగా రీల్స్ చేసి వార్తల్లో వ్యక్తిగా ఉండేవారు. అప్పటి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనుల వద్ద రీల్స్ చేసి.. పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వానికి సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఆ రీల్స్ ఆమె పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ నాయకులు తప్పు పట్టారు. తాజాగాస్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన ఒక ట్వీట్ దుమారాన్ని రేపుతోంది. “దివ్యాంగులు అంటే శారీరకంగా ఏదైనా వైకల్యం ఉన్న వారి రిజర్వేషన్లలో ప్రయారిటీ దేనికి ఇవ్వాలని” ఆమె ప్రశ్నించడం కలకలం రేపుతోంది. అయితే ఆమె చేసిన ట్వీట్ పై చాలామంది స్పందించారు. అభ్యంతరాలు వ్యక్తం చేశారు.. వ్యతిరేకంగా మాట్లాడారు. పైగా ఆ ట్వీట్ ను స్మిత సమర్ధించుకున్నారు..”వైకల్యం ఉన్న వ్యక్తి పైలట్ పనిచేయలేదు. వైకల్యం ఉన్న వారిని పైలట్లుగా నియమించుకుంటారా? వైకల్యం ఉన్నవారు శస్త్ర చికిత్సలు చేయగలరా? శస్త్ర చికిత్స నిపుణుడు కాగలరా” అంటూ వెకిలి సమర్ధన చేసుకున్నారు.

    “వాస్తవానికి సివిల్ సర్వీస్ లో ఉన్న అధికారులకు క్షేత్రస్థాయిలో ఎక్కువ పని ఉంటుంది. గంటలకొద్దీ ప్రయాస పడాల్సి ఉంటుంది. జనంలోకి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉంటుంది. సివిల్ సర్వెంట్లకు శారీరక దృఢత్వం అవసరం” అని స్మిత సబర్వాల్ చెబుతున్నారు.. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయి ఉండి ఇలాంటి తలతిక్క వ్యాఖ్యలు చేయడం.. ఆమె దిగజారుడు వ్యక్తిత్వానికి నిదర్శనమని దివ్యాంగులు మండిపడుతున్నారు..”గతంలో ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండేవారు. అన్ని పనులు ఆమె చేసేవారు. ఫీల్డ్ విసిట్ కు వెళ్లేందుకు హెలికాప్టర్ మాత్రమే వాడేవారు. ఓ మ్యాగజైన్ తనకు వ్యతిరేకంగా రాసిందని.. కోర్టుకు వెళ్లారు. కోర్టు ఫీజులను కూడా ప్రభుత్వం చెల్లించేలాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు లూప్ లైన్ లో ఉన్నారు. ఆఫీస్ కదలకుండా సోషల్ మీడియాలో రీల్స్ పెడుతున్నారు. ఫోటోలు పోస్ట్ చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఇలాంటి అధికారి తమపై అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదని” దివ్యాంగులు మండిపడుతున్నారు..

    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత జైపాల్ రెడ్డికి రెండు కాళ్లు లేకపోయినప్పటికీ అద్భుతమైన రాజకీయ నాయకుడిగా వ్యవహరించారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో 2015 నుంచి 17 వరకు లోకేష్ అనే ఐఏఎస్ అధికారి కలెక్టర్ గా పని చేశారు. ఆయనకు కూడా శారీరక వైకల్యం ఉంది. అలాంటి వ్యక్తి సివిల్ సర్వెంట్ గా ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లాలో తనదైన మార్కు పరిపాలన చూపించారు. ఐపీఎస్ వంటి పోస్టులకు మాత్రమే వైకల్యం అడ్డుకుంటుంది. ఐఏఎస్ లాంటి పోస్టులకు వైకల్యం అనేది అడ్డుకాదు. అయినా సరే దివ్యాంగులు ఐఏఎస్ పోస్టులకు ఎంపికై.. అద్భుతంగా పనిచేస్తున్నారు.. అలాంటి విషయాలు తెలిసినప్పటికీ.. స్మితా సబర్వాల్ ఈ నేలబారు వ్యాఖ్యలు చేయడం పట్ల దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.