https://oktelugu.com/

Rajamouli- Mahesh Babu : రాజమౌళి మహేష్ బాబు సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఆ హీరోయిన్ తో సంప్రదింపులు జరుపుతున్న జక్కన్న…

సినిమా ఇండస్ట్రీ లో రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ గురించి గత 10 సంవత్సరాలుగా చర్చ జరుగుతుంది. ఇక ఎట్టకేలకు అది ఇప్పుడు వర్కౌట్ అయింది...

Written By:
  • Gopi
  • , Updated On : July 22, 2024 / 04:36 PM IST
    Follow us on

    Rajamouli- Mahesh Babu-: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా తన సినిమాలను విస్తరిస్తున్నాడు. ఇక అదే విధంగా ఆయన చేసే సినిమాలతోనే తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మహేష్ బాబుతో ఆయన ఒక భారీ సినిమాను చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం దాదాపు 1200 కోట్ల వరకు బడ్జెట్ ను కూడా కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎప్పటినుంచో ఈ సినిమా వర్క్ లోనే బిజీగా ఉంటున్న రాజమౌళి ఈ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనే విషయం మీదనే సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. మహేష్ బాబు కు ఒక మంచి మేకోవర్ అందించిన రాజమౌళి ఇక అతను చేయాల్సిన పని మాత్రమే బ్యాలెన్స్ గా ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూనే అది ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందనే విషయాన్ని మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంచుతున్నాడు. ఇక రాజమౌళి తన గత చిత్రాల మాదిరిగానే ప్రెస్ మీట్ ను పెట్టి ఈ సినిమాకి సంబంధించిన వివరాలను తెలియజేసే పనిని చేపట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాజమౌళి మహేష్ బాబు కలయికలో వస్తున్న సినిమా అంటే సరి కొత్త కాంబో కాబట్టి దీని మీద మొదటి నుంచి కూడా అందరికీ చాలా అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటికే మహేష్ బాబు మాస్ హీరోగా తనను తాను చాలా వరకు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే రాజమౌళి కూడా మాస్ సినిమాలు చేయడం లో మాస్టర్ డిగ్రీ చేసిన డైరెక్టర్ కాబట్టి వీళ్ళ కాంబినేషన్ కి అటు మాస్ లోనూ, ఇటు క్లాసు లోనూ రెండింటిలో కూడా ఇది చాలా బాగా వర్కవుట్ అవుతుందనే చెప్పాలి.

    ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఇప్పటి వరకు సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లలేదు గాని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు సంబంధించిన పనులన్నిటిని పూర్తి చేసి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా ఒక్కసారి సెట్స్ మీదకి వెళ్ళింది అంటే ఎక్కడ ఆగిపోకూడదనే ఉద్దేశ్యం తోనే ఆయన ముందుగానే ఈ పనులన్నింటిని కంప్లీట్ చేసి పెడుతున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన కొంతమంది నటి నటులను కూడా ఆయన తీసుకున్నాడట..

    అయితే ఇప్పటివరకు ఎవరిని కూడా రివిల్ చేయకపోయినప్పటికి ఆయన సినిమాలో భారీ కాస్టింగ్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక వివిధ భాషలకు చెందిన నటీనటులను కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేస్తున్నాడట. ముఖ్యంగా కన్నడ, తమిళ్, మలయాళం, బాలీవుడ్ కి సంబంధించిన నటులను ఈ సినిమాలో ఎక్కువగా తీసుకుంటున్నాడట… అలాగే ఇంటర్నేషనల్ స్టార్స్ ను కూడా ఈ సినిమాలో పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పుడూ అందుతున్న సమాచారం ప్రకారం ‘అనిమల్ ‘ మూవీ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న త్రిప్తి డిమ్రి ని ఒక స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నాడట. ఇక ఆ సాంగ్ మహేష్ బాబుకి ఆమెకి ఈ మధ్య జరిగే సాంగ్ గా తెలుస్తుంది. అది ఐటెం సాంగ్ గా ఉండబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

    ఇక రీసెంట్ గా ఆమె నటించిన ‘బ్యాడ్ న్యూజ్’ అనే సినిమా రిలీజ్ అయింది. ఇక త్రిప్తి ఈ మూవీలో ఉందనే కారణం చేతనే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కాబట్టి ఈమెకు జనంలో ఉన్న క్రేజ్ ను గమనించిన జక్కన్న ఆ సాంగ్ కి ఈమె అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అలాగే తనకి మంచి క్రేజ్ కూడా ఉంది. కాబట్టి యూత్ లో కూడా మంచి ఆదరణ దక్కుతుందనే ఉద్దేశ్యం తో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…