https://oktelugu.com/

Telangana: కాళేశ్వరం కౌగిట్లో కేటీఆర్‌.. బెడిసి కొట్టిన ట్వీట్‌.. కాంగ్రెస్‌కు అడ్డంగా దొరికిపోయారు..!

కాళేశ్వరం... తెలంగాణలో రూ.లక్ష కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు. ప్రారంభించిన రెండేళ్లే ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజీ పియన్స్‌ కుంగిపోయాయి. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి ఇదీ ఓ కారణమే.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 22, 2024 / 04:12 PM IST

    KTR Tweet On Kaleshwaram Project

    Follow us on

    Telangana: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ పియర్స్‌ గతేడాది ఆగస్టులో కుంగిపోయాయి. దీంతో నీటి ఎత్తిపోతలు ఆగిపోయాయి. దీంతో యాసంగిలో పంటలకు సాగునీరు అందలేదు. ఇదిలా ఉండగా, నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. వచ్చీ రావడంతోనే కాళేశ్వరంలో అవినీతిపై దృషిపెట్టింది. జుడీషియల్‌ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తోంది. సీఎం రేవంత్‌తోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు కళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ కూడా ఇచ్చారు. తర్వాత నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీలో కుంగిని పిల్లర్లకు మరమ్మతులు చేపట్టింది. కానీ ఇప్పటికీ అవి పూర్తికాలేదు. మరోవైపు డ్యాంలో నీరు నిలుపొద్దని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచించింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన కుంగిన పియర్స్‌ వద్ద ఏట్లను తొలగించే పనులు చేపట్టింది ప్రభుత్వం. ఇక ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఇపుపడు మేడిగడ్డకు ఇటు గోదావరి, అటు ప్రాణహిత నదుల నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో నది నిండుగా ప్రవహిస్తోతంది. అయితే డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు.

    కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌..
    ఇదిలా ఉంటే.. మేడిగడ్డ బ్యారేజీపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు. మొన్నటి వరకు పంట రుణాల మాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌ను విమర్శించిన కేటీఆర్‌.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో వరద నీటితో నిండుగా ప్రవహిస్తున్న మేడిగడ్డ బ్యారేజీ వీడియోను పోస్టు చేశారు. ‘కాంగ్రెస్‌ కుట్రలన్నీ గోదాట్లో కొట్టుకుపోగా మేడిగడ్డ బ్యారేజి మాత్రం ఠీవిగా నిలబడింది’ అని రాసుకొచ్చారు. మేడిగడ్డ బ్యారేజీలో మూడు పియర్స్‌ కుంగినప్పటికీ ప్రాజెక్ట్‌ దివ్యంగా ఉందని, కానీ రేవంత్‌ రెడ్డి తమని అప్రదిష్టపాలు జేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం దెబ్బతిందన్నట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

    దీటుగా స్పందించిన కాంగ్రెస్‌..
    కేటీఆర్‌ ట్వీట్‌పై కాంగ్రెస్‌ పార్టీ దీటుగా బదులిచ్చింది. ‘మీ కాళేశ్వరరావు కమీషన్లకు కక్కుర్తితో పేకమేడలాంటి ప్రాజెక్ట్‌ కట్టాడు. మేడిగడ్డ బ్యారేజిలో గేట్లు మూసి నీళ్లు పితే ప్రాజెక్ట్‌ కొట్టుకుపోతుంది. అందుకే ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని వచ్చింది వచ్చిన్నట్లు బయటకు వదిలేయాల్సి వస్తోంది. నీళ్లన్నీ సముద్రంపాలవుతున్నాయి. తెలంగాణలో సాగు, తాగునీటి కోసం నిల్వ చేయవలసిన నీళ్లు సముద్రంలో కలుస్తుంటే.. సన్నాసులు సంకలు గుద్దుకుంటున్నారు,’’ అంటూ బదులిచ్చింది.

    కాళేశ్వరంపై గొప్పలు..
    ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా చెప్పకునేది. దీనిపై నేషనల్‌ జియోగ్రఫీ ఛానెల్‌లో కూడా ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేయించింది. కాళేశ్వరం అంటే కేసీఆర్‌ అన్నట్లుగా ప్రచారం చేసుకుంది. కేసీఆర్‌ సొంత ఆలోచనతో చేపట్టిన ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అయిందని ప్రచారం చేసుకున్నారు. గొప్పలు చెప్పుకున్నారు. టీవీలు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నారు. అయితే ఇంత ప్రచారం చేసుకున్న ప్రాజెక్టులో ప్రధానమైన, మొదటి బ్యారేజీ మేడిగడ్డ ఆ పార్టీ అధికారంలో ఉండగానే పిల్లర్లు కుంగింది. దీని మరమ్మతులుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతోనే ప్రనస్తుతం ప్రాజెక్టు నిలబడింది.కానీ, ఈ విషయాన్ని మర్చిపోయిన కేటీఆర్‌.. తాము కట్టిన ప్రాజెక్టు పటిష్టంగా ఉందని ట్వీట్‌ చేయడం ఇపుపడు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ సర్కార్‌ బ్యారేజీ గేట్లు మూసివేస్తే.. నీరు నిలిచి ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే కేసీఆర్‌ పరువు అదే గోదాట్లో కొట్టుకుపోవడం ఖాయం. రాజకీయాల కోసం మేడిగడ్డ బ్యారేజిని దెబ్బ తీసుకుని రాష్ట్రానికి నష్టం కలిగించడం సరికాదని సిఎం రేవంత్‌ రెడ్డి భావించడం వలననే వరద నీటిని దిగువకు వెళ్లిపోతోంది. ఈ విషయాన్ని కేటీఆర్‌ గమనించకుండా… మళ్లీ కాళేశ్వరం గురించి గొప్పగా ట్వీట్‌ చేసి.. కాంగ్రెస్‌కు అడ్డంగా దొరికిపోయారు.