Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. హైదరాబాదు నగరం మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటారు. నిర్వాహకులు కూడా భక్తులకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాదం వితరణ చేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ వేడుకల మాటున కొంతమంది అసాంఘిక, అసభ్యకరమైన పనులకు పాల్పడుతున్నారు. వాటి వల్ల మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ సమస్యకు హైదరాబాద్ షీ టీమ్స్ అద్భుతమైన సమాధానం చెప్పింది.
హైదరాబాద్ షీ టీమ్ అద్భుతమైన పని చేసింది. ఖైరతాబాద్ వినాయక మండపం పరిసర ప్రాంతాల్లో మహిళలు, యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరి వెధవలకు దిమ్మతిరిగే బుద్ధి చెప్పింది. ఇటీవల కాలంలో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రదర్శించిన ప్రాంతంలో పోకిరిలు చేసిన పనిని పకడ్బందీ ఆధారాలతో హైదరాబాద్ షీ టీం పట్టుకుంది. తొమ్మిది రోజుల్లో మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన 930 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా వినాయకుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వచ్చినప్పుడు.. క్యూలో ఉన్న మహిళలను, యువతులను ఉద్దేశపూర్వకంగా అసభ్యకరంగా తాకినట్టు పోలీసు బృందాలు గుర్తించాయి. పోలీసు బృందాలు పట్టుకున్న వారిలో 55 మంది మైనర్లు ఉన్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. కొందరు మేజర్లు లో ఉండడంతో వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.
ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి భక్తులు భారీగానే వస్తుంటారు. అయితే భక్తి చాటున కొంతమంది అసాంఘిక, అసభ్యకరమైన కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఈ విషయం పోలీసు దృష్టికి రావడంతో కొంతకాలంగా ఖైరతాబాద్ వినాయకుడి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఆకతాయిలను, పోకిరిలను పట్టుకుంటున్నారు. గత ఏడాది కూడా ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారిని పోలీసు బృందాలు పట్టుకున్నాయి. వారిలో కొంతమందికి కౌన్సిలింగ్ నిర్వహించగా.. మరి కొంతమందిని కోర్టుకు తరలించాయి.
Over the last 7 days, #SHETeams nabbed as many as 900 #miscreants for harassing #women near the #KhairatabadGanesh pandal, 55 caught red-handed.#Police counselled the offenders; some will be produced in court.
SHE Teams remain on 24×7 duty during idol immersion.… pic.twitter.com/tlcXuKVXrr
— NewsMeter (@NewsMeter_In) September 4, 2025