Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi And Naveen Polishetty: ఆ సినిమా విషయంలో నవీన్ పోలిశెట్టి ఎక్స్ ట్రాలు చేశాడా..?...

Chiranjeevi And Naveen Polishetty: ఆ సినిమా విషయంలో నవీన్ పోలిశెట్టి ఎక్స్ ట్రాలు చేశాడా..? చిరంజీవి కోపానికి కారణం అదేనా..?

Chiranjeevi And Naveen Polishetty: ఈ జనరేషన్లో సినిమా ఇండస్ట్రీకి వస్తున్న ప్రతి ఒక్కరు చిరంజీవిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చినవాళ్లే కావడం విశేషం… ఆయన లేకపోతే అసలు మేము ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళమే కాదంటూ కొంతమంది దర్శకులు సైతం చిరంజీవి గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. నిజానికి చిరంజీవి ఏం చేశాడంటే ఒకప్పుడు మూస ధోరణిలో వెళ్తున్న సినిమా విధానాన్ని మార్చేశాడు. ఆ తర్వాత హీరో అంటే ఎలా ఉండాలి అనే విధంగా బెంచ్ మార్క్ […]

Chiranjeevi And Naveen Polishetty: ఈ జనరేషన్లో సినిమా ఇండస్ట్రీకి వస్తున్న ప్రతి ఒక్కరు చిరంజీవిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చినవాళ్లే కావడం విశేషం… ఆయన లేకపోతే అసలు మేము ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళమే కాదంటూ కొంతమంది దర్శకులు సైతం చిరంజీవి గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. నిజానికి చిరంజీవి ఏం చేశాడంటే ఒకప్పుడు మూస ధోరణిలో వెళ్తున్న సినిమా విధానాన్ని మార్చేశాడు. ఆ తర్వాత హీరో అంటే ఎలా ఉండాలి అనే విధంగా బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఒక హీరో నార్మల్ కామన్ మ్యాన్ ల కాకుండా చాలా హై లో ఉండే విధంగా కనిపించాలి. అలాంటప్పుడు మాత్రమే ప్రేక్షకులు అతన్ని హీరోగా స్వీకరిస్తారని అతను ప్రేక్షకులకు ఒక సూపర్ మాన్ ల కనిపించేలా డ్యాన్స్ లు ఫైట్స్ చేస్తూ వచ్చాడు. అలాగే తన నటనతో ప్రేక్షకులందరిని మెప్పించి వాళ్ళందరి చేత శభాష్ అనిపించుకున్నాడు… అలాంటి చిరంజీవి ఇప్పటికి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎక్కడ విరామం తీసుకోకుండా సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. నవీన్ పోలిశెట్టి సైతం ప్రస్తుతం సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు. ఆయన ఇండస్ట్రీ కి వచ్చి 8 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేశాడు అంటే ఆయన ఒక కథ మీద ఎంత ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.

Also Read: రాష్ట్ర రాజకీయాల్లో ముగిసిన నితీశ్‌ శకం.. బీజేపీ ఖాలాలోకి బిహార్‌!

ఆయన చేసిన నాలుగు సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో ఆయన కూడా చాలా క్లారిటిగా ఉంటున్నాడు. చిరంజీవి ఒక మలయాళం సినిమాను రీమేక్ చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే కొంతమంది యంగ్ రైటర్స్ చేత స్క్రిప్ట్ మొత్తం రాయించారట.

ఇక చిరంజీవి తో పాటు ఇందులో ఒక యంగ్ హీరోతో నటించాల్సి ఉండగా ఆ పాత్ర కోసం నవీన్ పోలిశెట్టి ని తీసుకుందాం అనుకున్నారట. కానీ ఆ కథ నవీన్ కి అంత పెద్దగా నచ్చకపోవడంతో ఆ సినిమాకి అతను నో చెప్పాడు. దాంతో చిరంజీవి కోపానికి వచ్చాడట. ఇక అతని ప్లేస్ లో సిద్దు జొన్నలగడ్డ ను కూడా తీసుకున్నాడు.

అయినప్పటికి ఈ సినిమా కార్యరూపం దాల్చలేదు. మొత్తానికైతే ఇప్పుడు ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని పక్కన పెట్టేసారని తెలియాల్సి ఉంది… ఇక నవీన్ పోలిశెట్టి తనకి ఒక కథ నచ్చితేనే చేస్తాడు. స్టార్ డైరెక్టర్లు కథ చెప్పినంత మాత్రాన వాళ్ళతో ఏ మూవీ పడితే అది చేయలేనని పలు సందర్భాల్లో చెప్పాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper