Janhvi Kapoor: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు వాళ్ళకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ను సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటీనటులు రెస్టు లేకుండా సినిమాల కోసం విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. దానివల్ల వాళ్లకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అయిన జాన్వీ కపూర్ సైతం గత ఏడాది చేసిన ‘దేవర’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ తో పెద్ది అనే సినిమా చేస్తోంది. అయితే ఆమె సినిమా కెరియర్ స్టార్ట్ చేసిన కొద్దిరోజుల్లోనే చాలా బిజీగా మారిపోవడం వల్ల ఆమెకు రెస్టు లేకుండా చాలా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇక అప్పట్లో ఒకరోజు చెన్నైలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని ముంబై వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కింది. అప్పుడు ఆమెకు కడుపులో విపరీతమైన నొప్పిగా ఉందట.
ఇక ఆ ఫ్లైట్ దిగి తను ముంబై లో ఉన్న తన ఇంటికి చేరుకునే లోపే తనకు పెరలాసిస్ వచ్చి కాళ్ళు, చేతులు వంకర తిరిగిపోయాయి అంటూ ఆమె ఒక సందర్భంలో తెలియజేశారు. ఇక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ అప్పుడు వచ్చిన పెరలాసిస్ కి సంబంధించిన మెడిసిన్ ఇప్పటికీ వాడుతున్నానని చెప్పడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా రెస్టు లేకుండా ఆమె కంటిన్యూస్ గా సినిమాలు చేయడం వల్లే తనకు అలాంటి ఒక డిసీజ్ అయితే వచ్చిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం… ఇక ప్రస్తుతం ఫిట్ గానే ఉన్నప్పటికి తను షూటింగ్ లో సెలెక్టెడ్ సీన్స్ లో మాత్రమే నటిస్తోంది. రిస్కీ షాట్స్ లో డూప్ ను వాడాల్సిందే అని ఆమె కరాకండిగా చెప్పేస్తుందట. మరి ప్రతి సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది అంటూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమా మేధావులు సైతం ఇదే విషయాన్ని చెబుతూ ఉండటం విశేషం…
సినిమాలో ఆమె పాత్ర ను చాలా వరకు ఎడిటింగ్ లో లేపేశారు. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలో కూడా తన పాత్ర హైలెట్ అవుతుందా? లేదా అనే విషయంలోనే ఆమె చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే సినిమా సూపర్ సక్సెస్ ని సంపాదించి పెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…