Homeఎంటర్టైన్మెంట్Nagarjuna Balakrishna Multistarrer Movie Update: నాగార్జున బాలయ్య లను కలపబోతున్న స్టార్ డైరెక్టర్...

Nagarjuna Balakrishna Multistarrer Movie Update: నాగార్జున బాలయ్య లను కలపబోతున్న స్టార్ డైరెక్టర్…

Nagarjuna Balakrishna Multistarrer Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున గుర్తుకు వస్తారు. వీళ్ళ సినిమాలు చూసి చాలా మంది ఇన్స్పైర్ అయి ఇండస్ట్రీ కి వచ్చారు. చిరంజీవి మాస్ లో చాలా మంచి పట్టు ఉన్న హీరో… బాలయ్య సైతం కమర్షియల్ సినిమాలను అలవోక చేసి మెప్పించే నటుడు…వెంకటేష్ ఫ్యామిలీ హీరో…నాగార్జున రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు…ఇక ఈ మధ్య కాలంలో ఒకే స్టేజ్ మీద ఈ నలుగురు […]

Nagarjuna Balakrishna Multistarrer Movie Update: తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున గుర్తుకు వస్తారు. వీళ్ళ సినిమాలు చూసి చాలా మంది ఇన్స్పైర్ అయి ఇండస్ట్రీ కి వచ్చారు. చిరంజీవి మాస్ లో చాలా మంచి పట్టు ఉన్న హీరో… బాలయ్య సైతం కమర్షియల్ సినిమాలను అలవోక చేసి మెప్పించే నటుడు…వెంకటేష్ ఫ్యామిలీ హీరో…నాగార్జున రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు…ఇక ఈ మధ్య కాలంలో ఒకే స్టేజ్ మీద ఈ నలుగురు హీరోలు కలిసి కనిపించలేదు. కారణం ఏంటంటే బాలయ్య కి నాగార్జున కి మధ్య మాటలైతే లేవని చాలా మంది చెప్తున్నారు… వీళ్ళ
మధ్య ఏ గొడవలు జరగపోయిన కూడా కోల్డ్ వార్ నడుస్తుంది అంటూ చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…ఇక వీళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ప్లాన్ చేస్తున్నారు కానీ ఎవ్వరికి వర్కౌట్ కావడం లేదు…

Also Read: రాష్ట్ర రాజకీయాల్లో ముగిసిన నితీశ్‌ శకం.. బీజేపీ ఖాలాలోకి బిహార్‌!

కానీ అనిల్ రావిపూడి మాత్రం తొందర్లోనే దీనిని సాధ్యం చేస్తానని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట. ప్రస్తుతం ఆయన వెంకటేష్, కళ్యాణ్ రామ్ లతో సినిమాలు చేస్తున్నాడు… ఈ మూవీ పూర్తయిన వెంటనే నాగార్జున తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. రీసెంట్ గా నాగార్జున కి ఒక కథ కూడా వినిపించాడట.

ఆ కథ నాగార్జున కి బాగా నచ్చడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం బాలయ్య కూడా ఇందులో భాగం అవుతున్నాడట… వీళ్లిద్దరిని తెర మీద చూసిన ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలయ్య సైతం మంచి జోష్ లో ఉన్నాడు.

‘అఖండ 2’ సినిమా ను మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధించాయి…వరుసగా సక్సెస్ లను సాధించిన సీనియర్ హీరో కూడా తనే కావడం విశేషం…ఇక నిజంగానే అనిల్ రావిపూడి దీనిని సాధ్యం చేస్తే అటు అక్కినేని, ఇటు నందమూరి ఫ్యాన్స్ ఇద్దరు అనిల్ రావిపూడి కి వీరాభిమానులు అవుతారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper