Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోంది. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరలేదు. మొత్తం 18 మంత్రి పదవులు ఉండగా.. మొదటగా 11 మందికి పదవులు ఇచ్చారు. ఆరు నెలల క్రితం మరో ముగ్గురు మంత్రులుగా ప్రమాణం చేశారు. తాజాగా అజారుద్దీన్‌కు మైనారిటీ కోటాలో మంత్రి పదవి దక్కింది. ఇక రెండు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆశావహులు మాత్రం ఎక్కువగా ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం ఇప్పుడు కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో అజార్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారు. వ్యూహాత్మక నిర్ణయంగా సమర్థించినా.. సీనియర్ నాయకులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: చంద్రబాబు వల్ల మొంథా తుఫాను .. దానిని ఆపిన మగాడు జగన్.. ఆర్కే భలే పాయింట్ పట్టాడుగా..
ఆశవహులు వీరే..
మంత్రి పదవి ఆశిస్తున్నవారిలో మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, నేత ఫిరోజ్ ఖాన్ కూడా ఉన్నారు. వీరు కూడా మైనారిటీ కోటాలో పదవి ఆశించారు. కానీ ఆ ప్లేస్ భర్తీ కావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంజన్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ నుంచి రేసు తప్పుకున్నప్పటికీ, తన కష్టం మర్చిపోయారని అసంతృప్తిగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశాబ్దం పాటు పోరాడి కూడా పక్కనబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు చర్చ లేకుండా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై పార్టీలోని చాలా మంది గుర్రుగా ఉన్నారు.
మైనారిటీ ఓట్ల కోసమే..
అధిష్టానం ప్రకారం, మైనారిటీ వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం అవసరమని భావించి అజారుద్దీన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే, పార్టీ అంతర్గత వర్గాలు ఈ సాకును ప్రశ్నిస్తున్నాయి. ప్రాతినిత్యం పేరుతో ఓటమి పొందిన అభ్యర్థికి పదవి ఇవ్వడం ప్రోత్సాహకమా, లేక పార్టీ క్రమశిక్షణకు భంగమా అన్న దానిపై చర్చ మొదలైంది. దీనినినే ఇప్పుడు నేతలంతా తప్పుపడుతున్నారు.
నామినేటెడ్ పోస్టులపైనా..
ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలోను సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మధుయాష్కీ గౌడ్, జగ్గారెడ్డి వంటి నేతలు ఎమ్మెల్యేలను తప్ప ఇతరులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది సీనియర్ సభ్యులు మీడియాకు ఆఫ్‌ద రికార్డ్‌గా, పార్టీ జూబ్లీహిల్స్‌లో ఓడిపోవడం అజారుద్దీన్ వైరివిధానం అని గుసగుసలాడుతున్నారు. ఈ వివాదం రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త శక్తి సమీకరణలకు తెరతీసే అవకాశముందని భావిస్తున్నారు.
మొత్తంగా అజార్ మంత్రి పదవి మరోసారి కాంగ్రెస్‌లో సీనియర్–యువ వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. అధిష్టానం ఎలాంటి సమీక్ష చేపట్టి అసంతృప్తులను చక్కదిద్దుతుందనే దానిపైనే పార్టీ అంతర్గత ఐక్యత ఆధారపడి ఉంటుంది.