Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు కల్వకుంట్ల కవితను ఆ పార్టీకి చెందిన మాజీ మహిళా మంత్రులు మంగళవారం ములాఖత్ అయ్యారు. ఇటీవలే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితతో ములాఖత్ అయ్యారు. ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. మరోవైపు కవిత కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు కవితతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. కవిత భర్న అనిల్ 15 రోజులకు ఒకసారి ములాఖత్ అవుతున్నారు. కేటీఆర్ కలిసిన నాలుగు రోజులకే మహిళా నేతలు వెళ్లడం చర్చనీయాంశమైంది.
Also Read: CM Revanth Reddy: శభాష్ సురేశ్.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను అభినందించిన సీఎం!
80 రోజులుగా జైల్లో..
కవిత అరెస్ల్ అయి మూడు నెలలు కావస్తోంది. 80 రోజులుగా ఆమె జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసులో కవితను ఈడీ మార్చి 15న అరెస్ట్ చేసింది. తర్వాత 10 రోజుల కస్టడీ కోరింది. తర్వాత మార్చి 26న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టగా జ్యుడీషియల్ కస్టడీకి జడ్జి ఆదేశించారు. తర్వాత 14 రోజులకు ఒకసారి పొడగించింది. జ్యుడీషియల్ రిమాండ్‌లోఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజులు కస్టడీకి తీసుకుంది. తర్వాత సీబీఐ కేసులోనూ కవితకు కోర్టు కస్టడీ విధించింది.
Also Read: Telangana IPS : తెలంగాణలో 28 మంది ఐపీఎస్‌ల బదిలీ..
బెయిల్ కోసం ప్రయత్నం..
మరోవైపు కవిత పలుమార్లు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సుప్రీం కోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. ఈ క్రమంలో ఇటీవల ఈడీ, సీబీఐ చార్జిషీట్ దాఖలు చేశాయి. దీంతో బెయిల్ వస్తుందని కవిత భావించారు. కానీ, చార్జిషీట్ వేసిన తర్వాత కూడా బెయిల్ ఇవ్వకూడదని దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాన్ని కోరాయి. దీంతో కోర్టు బెయిల్ నిరాకరించింది. జూన్ 24 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది.