CM Revanth Reddy: శభాష్‌ సురేశ్‌.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను అభినందించిన సీఎం!

యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్షకు వెళ్తున్న ఓ యువతిని హైదరాబాద్‌కు చెంది ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌ సమయానికి చేర్చిన విషయం తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆ కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

Written By: Raj Shekar, Updated On : June 17, 2024 1:54 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: పోలీసులు అంటే.. శాంత్రిభద్రత పరిక్షణే కాదు.. ట్రాఫిక్‌ పోలీసులు అంటే ట్రాఫిక్‌ పనులు చూసుకోవడమే కాదు ఆపదలో ఉన్నవారిని సమస్య నుంచిబయట పేయడం కూడా అని నిరూపిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇప్పటికే పలు సందర్భాల్లో మనత్వం చాటుకున్నారు. గుండెపోటు బాధితులకు సీపీఆర్‌ చేసి ప్రాణాలు నిలిపారు. ఈ క్రమంలో తాజాగా ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష రాసే యువతిని సమయానికి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి శభాష్‌ అనిపించుకున్నాడు.

అభినందించిన సీఎం..
యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్షకు వెళ్తున్న ఓ యువతిని హైదరాబాద్‌కు చెంది ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌ సమయానికి చేర్చిన విషయం తెలుసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆ కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు చేశారు. ‘వాహనాల నియంత్రమ మాతే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భవించిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌కు అభినందనలు’ అని ట్వీట్‌ చేశారు. సురేశ్‌ సహకారంతో సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆల్‌ది బెస్ట్‌ చెప్పారు.

ఏం జరిగిందంటే..
యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన ఓ యువతి పరీక్ష కేంద్రం చిరునామా తెలియకపవడంతో తాను దిగాల్సిన స్టాప్‌లో కాకుండా దూరంగా ఉన్న మైలార్‌దేవులపల్లి పల్లె చెరువు వద్ద దిగింది. అక్కడి నుంచిపరీక్ష కేంద్రం దూరంగా ఉండడం, పరీక్ష సమయం దగ్గరపడుతుండంతో ఆమె కంగారు పడ్డారు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌ ఆమె ఆందోళనను గుర్తించి విషయం తెలుసుకున్నాడు. వెంటనే తన బైక్‌పై పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాడు.