https://oktelugu.com/

Telangana IPS : తెలంగాణలో 28 మంది ఐపీఎస్‌ల బదిలీ..

Telangana IPS తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఈమేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు అధికారులను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2024 10:01 am
    Transfer of 28 IPS in Telangana

    Transfer of 28 IPS in Telangana

    Follow us on

    Telangana IPS : లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో పాలనపై దృష్టిపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి అందుకు అనుగుణంగా అధికారుల బదిలీలు చేపట్టారు. రెండు రోజుల క్రితం 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. వీరంతా ఆదివారం(జూన్‌ 16న) విధుల్లో చేశారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఈమేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు అధికారులను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

    బదిలీ అయింది వీరే…
    = జగిత్యాల ఎస్పీగా అశోక్‌కుమార్‌
    = సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌సింగ్‌
    = హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా రాహుల్‌ హెగ్డే
    = జోగులాంబ గాద్వాల ఎస్పీగా టి.శ్రీనివాస్‌రావు
    = ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా రుత్‌రాజ్‌
    = సీఐడీ ఎస్పీగా విశ్వజిత్‌ కంపాటి
    = కుమురంభీం ఆసిఫాబాద్‌ ఎస్పీగా డీవీ.శ్రీనివాస్‌రావు
    = బాలానగర్‌ డీసీపీగా కె.సురేశ్‌కుమార్‌
    = మహబూబ్‌నగర్‌ ఎస్పీగా జానకి ధరావత్‌
    = సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్ధన్‌
    = శంషాబాద్‌ డీసీపీగా బి.రాజేశ్‌
    = మేడ్చల్‌ జోన్‌ డీసీపీగా ఎన్‌.కోటిరెడ్డి
    = వికారాబాద్‌ ఎస్పీగా కె.రారాయణరెడ్డి
    = నల్గొండ ఎస్పీగా శరత్‌చంద్రపవార్‌
    = సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీగా చందనాదీప్తి
    = వరంగల్‌ సెంట్రల జోన్‌ డీసీపీగా షేక్‌ సలీమా
    = యాంటీ నార్కోటిక్‌ఓ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య
    = హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్‌
    = డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌ కమాండెంట్‌గా రోహిణి ప్రియదర్శిని
    = మంచిర్యాల డీసీపీగా ఎ.భాస్కర్‌
    = జనగామ వెస్ట్‌ జోన్‌ డీసీపీగా బి.మహేంద్ర నాయక్‌
    = టీజీఎస్పీ ఏడో బెటాలియన్‌(యాపల్‌గూడ ఆదిలాబాద్‌) కమాండెంట్‌గా నితికా పంత్‌ నియమితులయ్యారు.