PM Kisan : రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు.. ఇలా చెక్‌ చేసుకోండి!

PM Kisan : ఇక పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు జమ కావాలంటే రైతులు తమ బ్యాంకు ఖాతా కేవైసీని అప్‌డేట్‌ చేసుకుని ఉండాలి. కేవైసీ చేయని రైతులకు 17వ విడత డబ్బులు అందని కేంద్రం తెలిపింది.

Written By: NARESH, Updated On : June 18, 2024 3:38 pm
Follow us on

PM Kisan :  కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా పెట్టుబడి సాయంగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు రూ.6 వేల చొప్పున చెల్లిస్తోంది. మూడు విడతల్లో ఈ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలి సంతకం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఫైల్‌పైనే సంతకం చేశారు. ఈమేరకు దేశంలోని 9.26 కోట్ల మంది రైతులకు కేంద్రం రూ.20 కోట్ల విడుదల చేసింది. ఈ నిధులను ప్రధాని మోదీ మంగళవారం(జూన్‌ 18)న వారణాసిలో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి సమ చేశారు. దీంతో ఈరోజు నుంచి ఐదెకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రూ.2 చొప్పున జమ కానున్నాయి. ఇప్పటి వరకు 16 విడతల్లో ఇలా జమ చేయగా, ప్రస్తుతం 17వ విడత నిధులు విడుదల చేసింది.

స్టేటస్‌ ఇలా చేక్‌ చేసుకోండి..
రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌డ్రాయిడ్‌ ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంటే సరిపోతుంది. ఇంట్లో నుంచే వివరాలు చెక్‌ చేసుకోవచ్చు.

– ముందుగా పీఎం కిసాన్‌ బెనిఫిషియరీ స్టేటస్, ఇన్‌స్టాల్‌మెంట్‌ స్టేటస్‌ చెక్‌ చేసుకోవడానికి https//pmkisan.gov.in/ పోర్టల్‌ను ఓపెన్‌చేయాలి.

– తర్వాత Know Your Status అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

– తర్వాత రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.

– ఇప్పుడు Get Data అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే స్క్రీన్‌పై మీ బెనిఫిషియరీ స్టేటస్‌ కనిపిస్తుంది.

కేవైసీ అప్‌డేట్‌ అయితేనే..
ఇక పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులు జమ కావాలంటే రైతులు తమ బ్యాంకు ఖాతా కేవైసీని అప్‌డేట్‌ చేసుకుని ఉండాలి. కేవైసీ చేయని రైతులకు 17వ విడత డబ్బులు అందని కేంద్రం తెలిపింది. అలాగే బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయాలి. అలా చేయకుండా డబ్బులు జమ కావని పేర్కొంది. రైతులు కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు సూచించింది. అయినా కొందరు రైతులు అప్‌డేట్‌ చేయలేదు. ఈ విడత పీఎం కిసాన్‌ డబ్బులు రావాలంటే.. తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది.