Ram Gopal Verma : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక పుష్ప 2 సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ ఆ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన సంఘటన వల్ల ఆయన మీద ఒక కేసు అయితే నమోదైంది. ఇక మొన్న ఈ కేసుకు సంబంధించి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. దాంతో హైకోర్టు నుంచి అతనికి మధ్యంతర బేయిల్ అయితే మంజూరు అయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి పైన వరుసగా ట్రీట్స్ అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ‘ఒకప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ దానికి అల్లు అర్జున్ అరెస్టుకి మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటి? అంటూ ఒక క్వశ్చన్ అయితే అడిగాడు.
ఇక ఇద్దరు బెడ్ రూమ్ లో ఉన్నప్పుడే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అంటూ ఆయనే ఆ ప్రశ్నకి సమాధానాన్ని కూడా చెప్పాడు’. మరి మొత్తానికైతే రామ్ గోపాల్ వర్మ తెలంగాణ గవర్నమెంట్ అల్లు అర్జున్ విషయంలో చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది అంటూ తన ఉద్దేశ్యాన్ని జనానికి తెలియజేయడానికే తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి పైన వరుసగా ట్వీట్లు వేస్తున్నాడు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
మరి ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో అరెస్ట్ అవ్వడం వెనుక సినీ రాజకీయ ప్రముఖుల హస్తాలు కూడా ఉన్నాయంటూ కొంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం అందులో ఎవరు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ జరిగిన సంఘటనకు అనుకూలంగానే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా మధ్యంతర బెయిల్ తర్వాత అల్లు అర్జున్ ఈ కేసు విషయంలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నాడనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఈ సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఆయనకు ఈ కేసులో ఎలాంటి శిక్ష పడబోతుందనేది తెలియాల్సి ఉంది.
What’s common between the HONOURABLE CHIEF MINISTER OF TELANGANA @revanth_anumula and INDIA’S BIGGEST STAR @alluarjun is , they both got ARRESTED FROM THEIR BEDROOMS pic.twitter.com/bg7YJH1Qdl
— Ram Gopal Varma (@RGVzoomin) December 15, 2024