Bigg Boss Telugu 8 : గత రెండు బిగ్ బాస్ సీజన్స్ ఫినాలే ఎపిసోడ్స్ కి ముఖ్య అతిథులు ఎవ్వరు రాలేదు అనే విషయం మన అందరికీ తెలిసిందే. రెండవ సీజన్ కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ తర్వాత సీజన్ 3 నుండి సీజన్ 5 వరకు మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు. చిరంజీవి కంటెస్టెంట్స్ తో జరిపిన చిట్ చాట్ అప్పట్లో బాగా హైలైట్ అయ్యాయి. ఆ మూడు ఫినాలే ఎపిసోడ్స్ కి టీఆర్ఫీ రేటింగ్స్ రికార్డు స్థాయిలో వచ్చాయి. అయితే గత రెండు సీజన్స్ కి ఎందుకో బిగ్ బాస్ టీం ఎవరినీ పిలవలేదు. గత సీజన్ ఫినాలే ఎపిసోడ్ కి వారం రోజుల ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రాబోతున్నాడు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తర్వాత తెలిసింది.
ఈ సీజన్ కి కూడా అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా రాబోతున్నాడు అంటూ ప్రచారం సాగింది. అయితే బిగ్ బాస్ టీం అసలు అల్లు అర్జున్ ని సంప్రదించలేదని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం ప్రయత్నం చేస్తున్నారని, రామ్ చరణ్ కూడా ఈ ఫినాలే ఎపిసోడ్ లో పాల్గొనడానికి సుముఖత చూపించాడని తెలిసింది. నిన్న సాయంత్రం రామ్ చరణ్ కచ్చితంగా రాబోతున్నాడు అనే వార్త ఖరారు అయ్యింది. ఇప్పటికే హౌస్ నుండి ప్రేరణ నాల్గవ స్థానంలో, అవినాష్ 5వ స్థానం లో ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసారు. ఇక మిగిలిన టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరు రామ్ చరణ్ చేతుల మీదుగా కప్పు అందుకోబోతున్నారు. అది ఎవరు అనేది సాయంత్రం 7 గంటల వరకు సస్పెన్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ ఫినాలే కి వచ్చినందుకు రామ్ చరణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.
సాధారణంగా అయితే రెమ్యూనరేషన్ లేకుండా ఏ టాప్ స్టార్ కూడా బిగ్ బాస్ సీజన్స్ కి రారు. ఒక్క మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అక్కినేని నాగార్జున మీద అభిమానంతో ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా వచ్చాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే చేసాడట. నాగార్జున ఫోన్ చేసి ప్రత్యేకంగా ఆహ్వానించడంతో క్షణం కూడా ఆలోచించకుండా వస్తాను సార్ అని చెప్పాడట రామ్ చరణ్. ఈ సీజన్ కి 50 రోజుల తర్వాత టీఆర్ఫీ రేటింగ్స్ పాతాళం లోకి పడిపోయాయి. గౌతమ్, అవినాష్ కారణంగా మరీ డిజాస్టర్ రేటింగ్స్ రాలేదు కానీ, పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చాయట. మరి ఇప్పుడు రామ్ చరణ్ ఫినాలే ఎపిసోడ్ కి రావడం కారణంగా టీఆర్ఫీ రేటింగ్స్ భారీ రేంజ్ లో వస్తాయో లేదో చూడాలి. ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి స్టార్ మా ఛానల్ లో ఫినాలే ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది.