Revanth Reddy Kaleshwaram Project Repair: కాళేశ్వరం.. తెలంగాణలో గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు. కేవలం నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించారు. నీటి ఎత్తిపోతలు కూడా రెండేళ్లు సక్రమంగానే చేశారు. కానీ, మూడో ఏడాది ప్రాజెక్టులో కీలక బ్యారేజీ అయిన మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. అన్నారం బ్యారేజీ పిల్లర్లకు సమీపంలో బుంగలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రెండున్నరేళ్లుగా బ్యారేజీలు ఖాళీగా ఉంటున్నాయి. ఎల్లంపల్లి నుంచే నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకు బ్యారేజీ కుంగుదల ప్రాచారాస్త్రంగా మారింది. దీంతో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. కాళేశ్వరంలో అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చేందుకు జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఏడాదిపాటు విచారణ చేసిన కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. కానీ రేవంత్ ప్రభుత్వం దానిపై కేంద్రానికి లేఖ రాసింది.
వినియోగంలోకి తేవాలిని..
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి 2016లో బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. 20 లిఫ్టులు, 19 పంప్ హౌస్‌లు, 20 రిజర్వాయర్లతో 280 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు ఎత్తిపోయించేలా రూపొందించారు. 1.47 లక్షల కోట్ల ఖర్చుతో 18.25 లక్ష ఎకరాలకు నీటి సరఫరా లక్ష్యం నిర్మాణం చేపట్టారు. 139 మెగావాట్ల బాహుబలి మోటార్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 12 సబ్స్టేషన్లు ప్రత్యేకంగా నిర్మించారు.
Also Read: రెండు నెలల చిన్నారి చనిపోతే తప్ప కులాహంకారం తగ్గలేదు..
అవినీతి ఆరోపణలు, దర్యాప్తు
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీ ఆరోపించాయి. మొదటి నుంచి కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంగా మారిందని విమర్శించారు. అది నిజమే అన్నట్లు పిల్లర్లు కుంగిపోవడంతో ప్రజలు కూడా మొదట నిజమే అని భావించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఘోష్ కమిషన్ రిపోర్టు మునుపటి ప్రభుత్వంపై ఆర్థిక లోపాలు, కాంట్రాక్టర్లకు అనైతిక లాభాలు తేల్చింది. సీబీఐ దర్యాప్తు ఆదేశించింది,
మెడిగడ్డ సంక్షోభం
ఏడో బ్లాక్‌లో 16–22 పిల్లర్లు దెబ్బతిని, ఫౌండేషన్లు బలహీనపడ్డాయి. రెండేళ్లుగా మరమ్మతులు చేయలేదు. దీంతో ప్రాజెక్టు నిరుపయోగంగా మారింది. ఈ క్రమంలో కమిషన్ పేరుతో రెండేళ్లుగా ప్రాజెక్టుకు మరమ్మతు చేపట్టకపోవడంపై ప్రజల్లో, రైతుల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టును రేవంత్ సర్కార్ నిరుపయోగంగా మార్చిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం సరికాదన్న భావన ప్రజల్లో క్రమంగా బలపడుతోంది.
రేవంత్‌రెడ్డి యూటర్న్..
ప్రజల ఒత్తిడి, రైతుల ఆందోళనలతో మొదట ’వృథా’ అని చెప్పిన సీఎం, ఇప్పుడు మరమ్మతులకు సిద్ధమయ్యారు. నిర్మాణ సంస్థకు నోటీసులు పంపి మరమ్మత్తులు చేయించుతున్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి నీటి ప్రవాహం పునఃప్రారంభం, రైతుల అవసరాలు తీర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: ఆ గురుకులానికి ట్రాన్స్ జెండర్లు వచ్చారు.. ఏవో పూజలు.. హరీష్ రావు వ్యాఖ్యలతో సంచలనం!
మొత్తానికి కాళేశ్వరం విజయంలో సీబీఐ విచారణ మొదలు కాలేదు. మరోవైపు రెండున్నరేళ్లుగా వృథాగా ఉంటుంది. దీంతో ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై వ్యతిరేకత వస్తోంది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. దీంతో మరమ్మతులు షురూ చేశారు.