spot_img
HomeతెలంగాణCM Revanth Reddy: మహిళలకు గొప్ప శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: మహిళలకు గొప్ప శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గొప్ప శుభవార్త చెప్పింది. అంతేకాదు త్వరలోనే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో ఆశావాహుల్లో సందడి నెలకొంది. అయితే ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించింది కాదు.. మహిళ రుణాలకు సంబంధించింది అంతకంటే కాదు..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు మహాలక్ష్మి.. వడ్డీ లేని రుణాలు.. ఇతర సదుపాయాలను కల్పిస్తోంది. తాజాగా మహిళల విషయంలో మరొక అడుగు ముందుకేసింది. ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ మహిళలకు శుభవార్త చెప్పింది. అంగన్వాడి కేంద్రాలలో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను ఈ ఏడాదిలోగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. త్వరలోనే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో హెల్పర్ పోస్ట్లు 12,882 ఉన్నాయి. టీచర్ పోస్టులు మూడువేల ఒక వంద వరకు ఉన్నాయి. హెల్పర్ పోస్ట్ లకు 10.. టీచర్ ఉద్యోగాలకు ఇంటర్ విద్యను కనీస ఉత్తీర్ణతగా నిర్ణయించారు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కొన్నాళ్లుగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు దారుణంగా మారింది. ప్రభుత్వం కొంతకాలంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖను ప్రక్షాళన చేస్తోంది. ఇందులో భాగంగా అంగన్వాడికి భాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ కూడా దీనికి ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతుందని తెలుస్తోంది. కలెక్టర్ ఆధ్వర్యంలోనే నియామక ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.. ఆ తర్వాత వెంటనే కొత్త ఉద్యోగులు విధుల్లో చేరుతారు. పైగా జనాభా పెరిగిన నేపథ్యంలో చాలావరకు కొత్త అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడిన నేపథ్యంలో.. వాటికి తగ్గట్టుగా అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అంగన్వాడి కేంద్రాల్లో చిన్నపిల్లలకు ఇప్పటికే ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. కేంద్రం సహకారంతో చిన్నపిల్లలకు గుడ్లు.. ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలను సరఫరా చేస్తోంది. గర్భిణులకు కూడా పాలు.. గుడ్లు.. కందిపప్పు.. అందజేస్తోంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper