Retirement: ఇక విశ్రాంతి.. తెలంగాణలో మూడేళ్ల తర్వాత రిటైర్మెంట్స్‌..!

తెలంగాణలో మార్చి 30న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలు, సొసైటీల్లో ప్రభుత్వరంగ సంస్థల్లో 60 మంది, ఆర్టీసీలో 176 మంది, పోలీస్‌ శాఖలో 100 మంది రిటైర్‌ అయ్యారు.

Written By: Raj Shekar, Updated On : March 31, 2024 10:49 am

Retirement

Follow us on

Retirement: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ విరమణలు ప్రారంభమయ్యాయి. 2021, మార్చిలో అప్పటి ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో మూడేళ్లు రిటైర్మెంట్లు ఆగిపోయాయి. రిటైర్మెంట్‌ అవ్వాల్సిన వారు కంటిన్యూ అయ్యారు. మూడేళ్లు కావడంతో మళ్లీ శనివారం(మార్చి 30) నుంచి రిటైర్మెంట్లు మొదలయ్యాయి. పలు కార్యాలయాల్లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది రిటైర్‌ అయ్యారు. వారికి అధికారులు అభినంనలు తెలిపారు.

రిటైర్మెంట్లు ఇలా..
తెలంగాణలో మార్చి 30న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలు, సొసైటీల్లో ప్రభుత్వరంగ సంస్థల్లో 60 మంది, ఆర్టీసీలో 176 మంది, పోలీస్‌ శాఖలో 100 మంది రిటైర్‌ అయ్యారు. రిటైర్‌ అయిన వారికి గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్, జీపీఎఫ్‌ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతీనెల ఇచ్చే పింఛన్‌ ఖరారు చేసి మరుసటి నెల నుంచి మంజూరు చేయాలి.

నెల రోజుల ముందే దరఖాస్తు..
ఇక రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం ఉద్యోగులు నెల ముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని ఏజీ కార్యాలయంలో ఆమోదించిన తర్వాత విరమణ ప్రోత్సాహకాలు అందుతాయి. పించన్‌ మినహా ఇతర ప్రోత్సాహయాలు ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ చనిపోయిన వారికి సైతం ఆరు నెలలు గడిచినా ప్రోత్సాహకాలు అందడం లేదని వాపోయారు. ఉద్యోగి రిటైర్‌ అయిన రోజు ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు.

మూడేళ్లు నష్టపోయిన నిరుద్యోగులు..
ఇదిలా ఉండగా కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో మూడేళ్లపాటు ఉద్యోగాల భర్తీ నిలిచిపోయింది. ఖాళీలు కాకపోవడంతో పోస్టులు అలాగే ఉండిపోయాయి. దీంతో మూడేళ్లు నిరుద్యోగులు సర్వీస్‌ కోల్పోయారు. ఇక కొంతమంది వయోపరిమితి దాటడంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అర్హత కూడా కోల్పోయారు.