Forests In Summer: వేసవిలో ఈ అడవుల యాత్రకు వెళ్తారా.. పులులను దగ్గరగా చూస్తారా?

అడవులకు పేరుపొందిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది.. ఆమధ్య ఆఫ్రికా ఖండం నుంచి తీసుకొచ్చిన చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలోని అడవుల్లోనే వదిలిపెట్టారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 31, 2024 10:41 am

Forests In Summer

Follow us on

Forests In Summer: ఎండలు దంచి కొడుతున్నాయి. బయటికి వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సెంట్రల్ సిలబస్ చదివే పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చారు. స్టేట్ సిలబస్ చదివే పిల్లలకు మరికొద్ది రోజుల్లో సెలవులు ఇస్తారు. సెలవు రోజుల్లో పిల్లలు ఇంట్లో ఉంటే ఇళ్ళు పీకి పందిరి వేస్తారు. పైగా ఇప్పుడు అన్ని కార్పొరేట్ చదువులే కాబట్టి.. పిల్లలకు స్కూలు లేదా ఇల్లే లోకం అవుతోంది. ఆడుకునేందుకు.. సరదాగా సేద తీరేందుకు వారికి అవకాశం లభించడం లేదు. ఇలాంటి సమయంలో వారికి సెల్ ఫోన్ లే కాలక్షేపం అవుతున్నాయి. రోజూ అందులోనే మునిగితేలడం వల్ల వారిలో మానసికపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు కాలక్షేపం కావాలంటే వేసవిలో విహారయాత్రకు మించిన బెస్ట్ ఆప్షన్ లేదు. విహారయాత్రల్లో అటవీ యాత్ర పిల్లలకు మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. దట్టమైన అడవిలో, క్రూర జంతువులను దగ్గరుండి చేస్తే ఆ మజానే వేరు. పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా అలాంటి విహారయాత్రను అమితంగా ఆస్వాదించొచ్చు. ఇంతకీ మనదేశంలో దట్టమైన అడవులు ఎక్కడ ఉన్నాయి? ఏ అడవుల్లో సఫారికి అవకాశం ఉంది? ఈ అంశాలపై ప్రత్యేక కథనం.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్

ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇది పురాతన జాతీయ అటవీ ఉద్యానం. హిమాలయాల దిగు ప్రాంతంలో ఈ ఉద్యానం ఉంది. ఈ అటవీ రెండు భాగాలుగా ఉంది. ఈ అటవీలో విభిన్న ఆవాసాలలో పులులు నివాస ఉంటాయి. వేసవికాలంలో సాహస యాత్ర చేయాలనుకునే వారికి ఈ అడవి ఉత్తమమైన ఎంపిక. నైనిటాల్ జిల్లాలో ఈ అడవి ఉంది. ఈ ప్రాంతాన్ని సందర్శించాలనుకునేవారు 097593 63344 నం లో సంప్రదించవచ్చు.

రణ తంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్

ఎడారి రాష్ట్రంగా పేరొందిన రాజస్థాన్ లో రణ తంబోర్ అడవి ప్రసిద్ధ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గా పేరొందింది. ఈ అడవిలో పురాతన శిథిలాలు, విస్తారమైన చెట్లు ఉన్నాయి. ఇక్కడ పులులు మాత్రమే కాకుండా.. ఇతర క్రూర జంతువులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవిని సందర్శించాలనుకునేవారు www. Ranthambore National park.in లో టికెట్లు బుక్ చేసుకోవాలి.

బాంధవ్ నగర్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్

అడవులకు పేరుపొందిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది.. ఆమధ్య ఆఫ్రికా ఖండం నుంచి తీసుకొచ్చిన చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రాష్ట్రంలోని అడవుల్లోనే వదిలిపెట్టారు. ఈ రాష్ట్రంలో బాంధవ్ నగర్ నేషనల్ పార్క్ లో టైగర్ సఫారీ మర్చిపోలేని అనుభవాన్నిస్తుంది. కేవలం పులులు మాత్రమే కాకుండా.. ఏనుగులు, హైనాలు, దుప్పులు, వంటి విస్తారమైన జంతువులకు ఈ అడవి ఆలవాలంగా ఉంటుంది. కొండలు, కోనలు ఈ అడవికి ఉన్న ప్రధాన ఆకర్షణ. ఈ అడవిలో టైగర్ సఫారీ చేయాలంటే +91 9212777223 నంబర్ లో సంప్రదించవచ్చు.

కన్హా టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్

విభిన్నమైన పులులకు ఈ అటవీ ప్రాంతం ఆవాసంగా ఉంది.. రుడ్ యార్డ్ క్లిప్ రచించిన నవల “ది జంగిల్ బుక్” ను ఈ అడవి ఆధారంగానే రాశారు. పులుల్లో విభిన్న రకాలు ఈ అడవిలో నివాసం ఉంటాయి. ఇతర దేశాల నుంచి పర్యాటకులు ఈ అడవిని చూసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు.. ఈ అడవిని సందర్శించాలనుకునేవారు www. Kanha National park.com లో సంప్రదించాలి.

తడోబా టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర

మహారాష్ట్రలో తడోబా టైగర్ రిజర్వ్ పులులకు విస్తారమైన ప్రాంతంగా వెలుగొందుతోంది. ఇక్కడ విభిన్న రకాల పులులు ఉన్నాయని ఇటీవల పరిశోధనలో తేలింది. తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఈ అడవిలో బైసన్ దున్నలు ప్రత్యేక ఆకర్షణ. ఈ అడవిలో టైగర్ సఫారీ చేయాలనుకునేవారు +91 9212553107 నంబర్ లో సంప్రదించాలి.

పెంచ్ టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఈ అటవీ ప్రాంతం ఉంటుంది. దట్టమైన వృక్షాలతో సరికొత్త అనుభూతిని పర్యాటకులకు అందిస్తుంది. ఈ అటవీ ప్రాంతం పులులకు సహజ ఆవాసంగా ఉంది. అందుకే ఇక్కడ పులులు విస్తారంగా కనిపిస్తాయి. www. Pench tiger reserve. Maharashtra.com లో టికెట్లు బుక్ చేసుకుని.. సఫారీ ని ఆస్వాదించవచ్చు.

సాత్పురా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్

ఒకవైపు కఠినమైన భూభాగం, మరోవైపు దట్టమైన వృక్షాలు.. ఇలా విభిన్న వాతావరణం ఈ అడవి సొంతం. సఫారీ, జంగిల్ రైడ్, బోటింగ్ వంటి సదుపాయాలు ఈ అడవిలో ఉన్నాయి. www. Sathpura National park.com ను సందర్శించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

సుందర్ బన్ నేషనల్ పార్క్, పశ్చిమ బెంగాల్

మన దేశానికే ప్రత్యేకమైన రాయల్ బెంగాల్ టైగర్ ఈ అడవిలోనే నివాసం ఉంటుంది. ఈ అడవిలో మడ వృక్షాలు ప్రత్యేక ఆకర్షణ. Sundarban affairsswb.inలో సంప్రదించి సఫారీ రైడ్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

కజిరంగ నేషనల్ పార్క్ అస్సాం,

ఖడ్గం మృగాలకు మాత్రమే కాకుండా వివిధ రకాలైన పులులకు ఈ అడవి ఆవాసం. ఏనుగులు, చుక్కల దుప్పులు ఈ ప్రాంతంలో విస్తారంగా ఉంటాయి.kaziranga national park.com లో టికెట్లు బుక్ చేసుకుని అడవిలోని అందమైన ప్రదేశాలను ఆస్వాదించవచ్చు.

పెరియార్ టైగర్ రిజర్వ్, కేరళ

కేరళ, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఈ అడవి ఉంది . ఈ అడవిలో ఏనుగులు మాత్రమే కాకుండా పులులు కూడా ఉంటాయి. ఈ అడవిలో విస్తారంగా మనుబోతులు ఉంటాయి. అందువల్లే ఇక్కడ పులులు జీవించగలుగుతున్నాయి. Periyar tiger reserve.com లో టికెట్లు బుక్ చేసుకుని టైగర్ సఫారీని ఎంజాయ్ చేయవచ్చు.