T20 Matches
T20 Matches: క్రికెట్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా ఒక క్రేజ్. ఒకప్పుడు వన్డే, టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఉండేవి. కానీ మారిన ఆట తీరుతో పొట్టి ఫార్మాట్ కూడా క్రికెట్‌లోకి వచ్చింది. ధనాధన్ క్రికెట్‌గా టీ20 గుర్తింపు పొందింది. దాదాపు 20 ఏళ్లుగా పొట్టి క్రికెట్ క్రీడాభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో చాలా మంది క్రికెటర్లు ఈ ఫార్మాట్‌కు అలవాటు పడ్డారు. ఆటలో దంచికొడుతూ ప్రత్యేకంగా అభిమానులను సంపాదించుకుంటున్నారు.
ఎక్కు మ్యాచ్‌లు ఆడింది వీరే..
ఇక టీ20 విషయానికి వస్తే.. చాలా దేశాలు సొంతంగా టీ20 సిరీస్‌లు నిర్వహిస్తున్నాయి. అభిమానులకు క్రికెట్ పండుగతోపాటు ఆటగాళ్లకు కాసులు కురుస్తుండడంతో చాలా మంది పొట్టి ఫార్మాట్ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్‌లో చాలా మంది వందల మ్యాచ్‌లు ఆడేశారు.
– పొట్టి ఫార్మాట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా పొలార్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 600 టీ20 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్ 12,900 పరుగులు చేశాడు. 316 వికెట్లు పడగొట్టాడు. 362 క్యాచ్‌లు పట్టాడు.
– తర్వాత స్థానంలో వెస్టిండీస్ స్టార్ డ్వేన్ బ్రావో ఉన్నాడు. ఇతడు 573 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటి వరకు 6,957 పరుగులు చేశాడు. 625 వికెటుల పడగొట్టాడు. 271 క్యాచ్‌లు పట్టాడు.
– పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్..అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో మూడోస్థానంలో నిలిచాడు. ఇతను ఇప్పటి వరకు 542 మ్యాచ్‌లు ఆడాడు. 12,360 పరుగులు చేశాడు. ఇక 182 వికెట్లు కూడా తీయడం విశేషం. 225 క్యాచ్‌లు కూడా పట్టాడు.
– సునీల్ నరైన్.. వెస్టిండీస్‌కు చెందిన ఇతను కూడా 500 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటి వరకు 3,783 పరుగులు చేశాడు. 537 వికెట్లు పడగొట్టాడు. 105 క్యాచ్‌లుసైతం పట్టాడు.
– తర్వాతి స్థానంలో వెస్టిండీస్‌కే చెందిన మరో ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఉన్నాడు. ఇప్పటి వరకు 484 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటి వరకు 8,273 పరుగుల చేసిన రసెల్, బంతితో 434 వికెట్లు పడగొట్టాడు. 203 క్యాచ్‌లు కూడా అందుకున్నాడు.
– డేవిడ్ మిల్లర్.. సౌత్ ఆఫ్రికాకు చెందిన మిల్లర్ కూడా టీ20లో 471 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఫార్మాట్‌లో 10,099 పరుగులు చేశాడు. ఇక 292 క్యాచ్‌లు అందుకున్నాడు.
– క్రిస్‌గేల్.. వెస్టిండీస్‌కు చెందిన మరో స్టార్ క్రిస్‌గేల్ కూడా టీ20లో 463 మ్యాచ్‌లు ఆడాడు. పొట్టి ఫార్మాట్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. అత్యధికంగా 14,562 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 83 వికెట్లు తీశాడు. 104 క్యాచ్‌లు పట్టాడు.
– రవి బొపార.. న్యూజిలాండ్‌కు చెందిన ఈ బ్యాట్స్‌మెన్ 462 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఫార్మాట్‌లో 9,106 పరుగులు చేశాడు. 277 వికెట్లు కూడా తీశాడు. 152 క్యాచ్‌లు అందుకున్నాడు.
– అలెక్స్ హేల్స్.. ఇంగ్లండ్‌కు చెందిన హేల్స్ ఇప్పటి వరకు 449 మ్యాచ్‌లు ఆడాడు. టీ20 ఫార్మాట్‌లో 12,319 పరుగులు చేశాడు. బ్యాట్స్‌మెన్ కావడంతో వికెట్లు తీయలేదు. ఇక 221 క్యాచ్‌లు పట్టాడు.
– రోహిత్ శర్మ.. టీమిండియా కెప్టెన్ అయిన హిట్ మ్యాచ్ ఇప్పటి వరకు 428 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 11,225 పరుగులు చేశాడు. బౌలింగ్ కూడా చేసి 29 వికెట్లు తీశాడు. ఇక 167 క్యాచ్‌లు అందుకున్నాడు.