Telugu News Paper : “అధికారాంతమున చూడాలి అయ్యవారి చిత్రాలు” అని వెనుకటికి ఓ సామెత ఉంది.. ఈ సామెత ఆ పత్రిక యాజమాన్యానికి నూటికి నూరుపాళ్ళు కాదు కోటి పాళ్లు సరిపోతుంది. అధికారం కోల్పోయిన తర్వాత ఆ పత్రిక యాజమాన్యం ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది.. కాస్ట్ కటింగ్ పేరుతో నరకం చూపిస్తోంది.. అధికారం కోల్పోయామనే ఫ్రస్ట్రేషన్ కిందిస్థాయి ఉద్యోగుల మీద ప్రదర్శిస్తోంది.. నెత్తి మాసిన మిడిల్ మేనేజ్మెంట్..తలా తోకా లేని మేనేజ్మెంట్ పెద్దలు కింది స్థాయి ఉద్యోగులతో ఆటలాడుకుంటున్నారు. గతంలో ఈ పనికిమాలిన పత్రిక మేనేజ్మెంట్ కాస్ట్ కటింగ్ నిర్వహించాలనుకుంది. ఈ పత్రిక యజమాని నాడు ప్రతిపక్షంలో ఉన్నాడు.. దీంతో పత్రిక నిర్వహణ ఖర్చును తగ్గించాలి అనుకున్నాడు. ఈ బాధ్యతను ఒక కంపెనీకి అప్పగించాడు. ఆ కంపెనీ మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటించి ఉద్యోగులను తొలగించాలని.. యూనిట్ ఆఫీస్ లను మెర్జ్ చేయాలని సూచించింది. అప్పట్లో ఈ పనికిమాలిన సలహా ఇవ్వడానికి ఆ పనికిమాలిన కంపెనీకి ఈ పనికిమాలిన పేపర్ మేనేజ్మెంట్ లక్షల్లో ఫీజు చెల్లించింది. అదేదో ఉద్యోగులకు ఇచ్చినా బాగుండేది. కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు.. ఆ పనికిమాలిన పత్రిక మేనేజ్మెంట్ యూనిట్లను మెర్జ్ చేసింది. చివరికి ఏడాది గడిచిందో లేదో.. పేపర్ మేనేజ్మెంట్ కు వాస్తవం అర్థమైంది. చివరికి మళ్లీ ఏ యూనిట్ కు ఆ యూనిట్ లాగా ఉంచారు.. అయితే అప్పట్లో యూనిట్లను మెర్జ్ చేయడం వల్ల ఉపసంపాదకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పత్రిక యజమాని అధికారంలోకి వచ్చాడు.. దీంతో ఉద్యోగులకు భారీగా జీతాలు ఉంటాయని ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించానని చెప్పిన ఆయన.. సొంత పత్రికలో పనిచేసే ఉద్యోగులను మాత్రం పక్కన పెట్టాడు. ఆయన అధికారాన్ని వినియోగించుకున్న పత్రికలోని కొంతమంది పెద్దలు భారీగా వెనుకేసుకున్నారు. మిడిల్ మేనేజ్మెంట్ కూడా భారీగానే సొమ్ము చేసుకుంది ..కింది స్థాయి ఉద్యోగులు మాత్రం ఎప్పటిలాగే బాండెడ్ లేబర్ లాగా పని చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ పత్రిక ఆధిపతికి అధికారం దూరమైంది. దీంతో పనికిమాలిన మిడిల్ మేనేజ్మెంట్ కత్తి అందుకుంది. గతంలో ఓ కంపెనీ ఇచ్చిన నివేదిక బూజు దులపడం మొదలుపెట్టింది. అంతేకాదు ఉద్యోగుల కాస్ట్ కటింగ్ ప్రారంభించింది. చాలామందిని వేరే వేరే ప్రాంతాలకు బదిలీ చేసింది. ఇందులో బ్యూరో చీఫ్ లు, స్టాఫ్ రిపోర్టర్లు, ఎడిషన్ ఇన్చార్జిలు మాత్రమే కాదు ఉపసంపాదకులు కూడా ఉన్నారు. చివరికి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ల విషయంలో కూడా మేనేజ్మెంట్ కనికరం చూపలేదు.దీంతో ఆ పత్రిక డప్పు కొట్టే పొలిటికల్ పార్టీ లీడర్ల వద్దకు ఆ సంస్థలో పని చేసే సిబ్బంది వెళ్లారు. తమ బదిలీలను నిలుపుదల చేయాలని కోరారు. ఆ సిఫారసులను కూడా పత్రిక మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. ఉద్యోగులు మొత్తం మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధపడ్డారట. తమ ఆవేదన మొత్తాన్ని కొత్తగా నియమితుడైన ఎడిటర్ కు చెప్పారట. పిల్లల చదువులు ఆగమైపోతాయి కాబట్టి.. మార్చి వరకు బదిలీలను నిలుపుదల చేస్తున్నట్టు ఎడిటర్ చెప్పాడట. అంటే మార్చి వరకు బదిలీలు ఆగిపోతాయి. ఆ తర్వాత మెడ మీద కత్తులు వేలాడుతూనే ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే పనికిమాలిన పేపర్ యాజమాన్యాన్ని నమ్ముకొని ఎన్ని రోజులపాటు పనిచేయడమే పెద్దకర్మం. ఇప్పుడు దానికి లభిస్తోంది ఈ ఫలితం. మొత్తం ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలు బాగానే ఉన్నాయి. మిడిల్ మేనేజ్మెంట్ కూడా బాగానే ఉంది. చివరికి బలి అయింది కిందిస్థాయి ఉద్యోగులు మాత్రమే.