Kubera Collections : చాలా కాలం గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో తెరకెక్కిన ‘కుబేర'(Kuberaa Movie) సినిమా రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మంచి కమర్షియల్ సక్సెస్ గా నిల్చింది. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ లో అతి గడ్డుకాలాన్ని ఎదురుకుంటున్న అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కి కొత్త ఊపిరి పోసింది ఈ సినిమా. అక్కినేని అభిమానులు మా అభిమాన హీరో స్పెషల్ క్యారక్టర్ చేయడం ఏంటి?, అసలు ఇలాంటి రోల్ ఎలా ఒప్పుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో పెద్ద రచ్చ చేశారు కానీ, చివరగా సినిమా ఫలితాన్ని చూసి వాళ్ళు ఎంతో సంతృప్తి చెందారు. ఇక నటుడిగా హీరో ధనుష్(Dhanush) కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ లో ఒకటిగా నిల్చింది. మరో నేషనల్ అవార్డు కూడా ఆయనకు దక్కొచ్చు.
అయితే ఈ చిత్రం థియేట్రికల్ రన్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ముగిసినట్టే. గత రెండు మూడు రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ షేర్ వసూళ్లు కూడా రావడం ఆగిపోయింది. మరి ఓవరాల్ గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టింది. ఏ ప్రాంతాల్లో లాభాలు భారీగా వచ్చాయి?, ఏ ప్రాంతాల్లో నష్టాలు వచ్చాయి అనేది వివరంగా ఇప్పుడు మనం చూడబోతున్నాము. తమిళనాడు ప్రాంతం లో మాత్రం ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా పరిగణించవచ్చు. ఆ ప్రాంతంలో 18 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే షేర్ కనీసం పది కోట్ల రూపాయిల రేంజ్ లో కూడా ఉండదు. పెట్టిన డబ్బుల్లో సగానికి పైగా నష్టం వచ్చినట్టే.
అదే విధంగా ఈ చిత్రానికి భారీ లాభాలను తెచ్చిపెట్టిన ప్రాంతాల లిస్ట్ తీస్తే నైజాం, ఓవర్సీస్ ప్రాంతాలు ఉంటాయి. నైజాం లో 13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ లో 8 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే, ఫుల్ రన్ లో 16 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 68 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, కర్ణాటక లో 13 కోట్ల రూపాయిలు, కేరళలో కోటి 30 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 136 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 69 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.