Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh movie update: పట్టుమని 50 రోజులు కూడా లేవు..'ఉస్తాద్ భగత్ సింగ్'...

Ustaad Bhagat Singh movie update: పట్టుమని 50 రోజులు కూడా లేవు..’ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ పై మండిపడుతున్న ఫ్యాన్స్!

Ustaad Bhagat Singh movie update: ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ టీమ్ పై పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ పీకల్లోతు కోపం లో ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించకపోవడమే. వాస్తవానికి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ నే, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని మార్చి 27 న […]

Ustaad Bhagat Singh movie update: ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ టీమ్ పై పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ పీకల్లోతు కోపం లో ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించకపోవడమే. వాస్తవానికి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ నే, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని మార్చి 27 న విడుదల చేయబోతున్నట్టు మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చారు మేకర్స్. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్నీ మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా వాయిదా పడింది అనే విషయాన్నీ చెప్పిన తర్వాతే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీని అధికారికంగా చెప్పాలని చూస్తున్నట్టు సమాచారం.

అంటే మార్చి 27న విడుదల చెయ్యాలని అనుకున్న ‘పెద్ది’ చిత్రానికి బదులుగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. మార్చి 19 న లేదా మార్చి 26 న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. అదే కనుక నిజమైతే మేకర్స్ ఈపాటికి అధికారిక ప్రకటన ఇవ్వాలి. ఎందుకంటే సినిమా విడుదలకు పట్టుమని 50 రోజులు కూడా లేవు కాబట్టి. మేకర్స్ నుండి ఎలాంటి సమాచారం లేకపోవడం అభిమానులు వెర్రిక్కిపోయి ఉన్నారు. ఈ చిత్రానికి మార్కెట్ లో పెద్దగా బజ్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. డిసెంబర్ నెలలో విడుదల చేసిన ‘దేఖ్ లేంగే సాలా’ పాట హిట్ అయ్యింది కానీ, ఆ పాట కారణంగా ఈ సినిమాకు పెరిగిన హైప్ ఏమి లేదు. రెండవ పాట సిద్ధంగా ఉంది , త్వరలోనే విడుదల చేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. దాని గురించి కూడా ఇప్పుడు ఎలాంటి సమాచారం లేదు. రెండవ పాట విడుదలకు ముందే, ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారట.

ఇలా అన్ని అనాధికారిక సమాచారాలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఫ్యాన్స్ సహనం కోల్పోయారు. మేకర్స్ ని ట్యాగ్ చేసి ఈ చిత్రాన్ని విడుదల చేసే ఉద్దేశ్యం ఉందా అంటూ నిలదీస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సంస్థ నుండి నెట్ ఫ్లిక్స్ కి షిఫ్ట్ అయ్యింది. భారీ రేట్ కి అమ్ముడుపోయినట్టు సమాచారం. అంతా బాగానే ఉంది కానీ, విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తే ఈ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గానే వాళ్ళు ‘ఓజీ’ మూవీ సక్సెస్ తో మంచి ఊపు మీదున్నారు. ఇదే జోరు కొనసాగిస్తూ ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. అందుకు మేకర్స్ ఎంత వరకు సహకరిస్తారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper