HomeతెలంగాణNote For Vote Case: ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి రిలీఫ్‌.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి...

Note For Vote Case: ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి రిలీఫ్‌.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి షాక్‌!

Note For Vote Case: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పదేళ్ల క్రితం నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న.. నేటి సీఎం రేవంత్‌రెడ్డి నామినేటెడ్‌ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు ఇస్తూ పట్టుపడ్డారు. ఈ కేసు విషయంలో రేవంత్‌రెడ్డి జైలుకు కూడా వెళ్లొర్చారు. ఈ కేసులో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి పది నెలల క్రితం తెలంగాణ సీఎం అయ్యారు. దీంతో ఓటుకు నోటు కేసును మధ్య ప్రదేశ్‌కుగానీ, లేదా వేరే రాష్ట్ర కోర్టుకు గానీ బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌రెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై పలుమార్లు విచారణ జరిగింది. ఈ కేసులో విచారణ చేసే కోర్టు మారినా విషయం మారదు కదా అని సుప్రీం కోర్టు గతంలో వ్యాఖ్యానించింది. తాజాగా శుక్రవారం(సెప్టెంబర్‌ 20న) పిటిషన్‌పై విచారణ ముగించింది.

జవరరి 31న పిటిషన్‌..
ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు లేదా మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, నేతలు కల్వకుంట్ల సంజయ్, మాజీ మంత్రులు సత్యవతిరాథోడ్, బహమూద్‌ అలీ జనవరి 31న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌.గవాయ్, జస్టిస్‌ కేవీ. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణు స్వీకరించింది. ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది. కోర్టు మారితే.. విషయం మారదు కదా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

ముగిసిన విచారణ..
తాజాగా ఈ పిటిషన్‌పై శుక్రవారం(సెప్టెంబర్‌ 20న) విచారణ జరపిపిన సుప్రీం ధర్మాసనం.. విచారణను ముగించినట్లు ప్రకటించింది. సీఎం రేవంత్‌రెడ్డి కేసును ప్రభావితం చేస్తాడనేది పిటిషినర్‌ అపోహ మాత్రమే అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటికే ప్రభావింతం చేశాడనేందుకు ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో కేసు బదిలీకి బలమైన కారణం కనిపించడం లేదని పేర్కొంది. ప్రభావింతం చేసినట్లు గుర్తిస్తే పిటిషనర్‌ మళ్లీ రావొచ్చని తెలిపింది. ప్రస్తుతం పిటిషన్‌ను ఎంటర్‌టైన్‌ చేయలేమని స్పష్టం చేసింది. కేసు బదిలీకి నిరాకరించింది.

సీఎం, సీబీఐకి సూచనలు..
ఇదే సమయంలో సుప్రీం ధర్మాసనం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి, ఓటుకు నోటు కేసు విచారణ చేస్తున్న సీబీఐకి కూడా కీలక సూచనలు చేసింది. విచారణను ప్రభావితం చేయొద్దని రేవంత్‌రెడ్డికి సూచించింది. ఇక సీబీఐ కేసు విచారణ పురోగతిని రిపోర్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. కేసు బదిలీ లేకపోవడంతో రేవంత్‌రెడ్డికి బిగ్‌ రిలీఫ్‌ లభించింది. ఇక రేవంత్‌రెడ్డిని ఇబ్బంది పెట్టాలనుకున్న పిటిషనర్‌కు షాక్‌ తగిలింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular