Hydra Effect : హైడ్రా.. హైదరాబాద్‌లోని విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు కోసం సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. జూలై 25న హైడ్రా ఏర్పాటైంది. గడిచిన రెండు నెలల్లో హైదరాబాద్‌లో వంద ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఆక్రమణల తొలగింపును మొదట హైదరాబాదీలతోపాటు తెలంగాణ ప్రజలంతా స్వాగతించారు. విశ్వనగరం హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా మార్చడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. అయితే పేదల ఇళ్లను కూడా నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయడంతో ఇప్పుడు హైడ్రాపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా మూసీ సుందరీకరణ పేరుతోనూ బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను కూల్చివేయడంతో ప్రభుత్వం తీరును చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇక హైడ్రా దూకుడు ప్రభావం రియల్ వ్యాపారంపైనా పడింది. చాలా వరకు అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో గత సెప్టెంబర్ నెలలో 30 శాతానికిపైగా రిజిస్ట్రేషన్లు పడిపోయాయి.
సెప్టెంబర్‌లో ఇలా…
సెప్టెంబర్ నెలలో హైదరాబాద్‌లో 6,185 రెసిడెన్షిన్ ప్రాపర్టీలు నమోదు అయ్యాయి. 2022లో ఇదే కాలంతో పోలిస్తే 30 శాతానికిపైగా తగ్గుదల నమోదైందని నైట్ ప్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. సెప్టెంబర్‌లో నమోదైన ఆస్తుల మొత్తం విలువ రూ,3,378 కోట్లు. ఇది 42 శాతం పెరిగింది. ఇది ఖరీదైన గృహాల అమ్మకాను సూచిస్తుంది. హైరాబాద్‌లో నివాసయోగ్యమైన మార్కెట్‌లలో మేడ్చల్–మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు న్నాయి. నైట్‌ఫ్రాంక్ నివేదిక ప్రకారం 2023 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో అత్యధికంగా ఆస్తి రిజిస్ట్రేషన్లు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలు. మొత్తం రిజిస్ట్రేషన్లలో 51 శాతం. కాగా ఆస్తుల ధర రూ.25 లక్షలు. మొత్తం రిజిస్ట్రేషన్లలో 15 శాతం. టిక్కెట్ పరిణామాలతో ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్ల వాటా 2023 సెప్టెంబర్‌లో రూ.కోటి. అంతకన్నా ఎక్కువ 9 శాతంగా ఉంది. ఇక సెప్టెంబర్ 2022లో 8 శాతంతో పోలిస్తే ఎక్కువగా నమోదైంది.
2023, సెప్టెంబర్‌లో…
ఇక 2023 సెప్టెంబర్‌లో నమోదైన ఆస్తుల విలువ 1,000–2,000 చదరపు అడుగుల పరిధిలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ పరిణామ వర్గం 71 శాతం రిజిస్ట్రేషన్లు కలిగి ఉందని నివేదిక తెలిపింది. చిన్న గృహాలకు(500–1000 చదరపు అడుగులు) డిమాండ్‌లో మోడరేషన్ ఉంది. 2022 సెప్టెంబర్‌లో 16 శాతంగా ఉన్న ఈ కేటగిరీ రిజిస్ట్రేషన్లు 2023 సెప్టెంబర్ నాటికి 14 శాతానికి పడిపోయాయి. అయితే 2 వేల చదరపు అడుగు కన్నా ఎక్కువ ఆస్తులకు డిమాండ్ పెరిగింది. సెప్టెంబర్ 2022లో 9 శాతం నుంచి 2024 సెప్టెంబర్‌లో రిజిస్ట్రేసన్లు 11 శాతనికి పెరిగాయి.