https://oktelugu.com/

Vishnu Manchu: మౌనంగా చూస్తూ ఊరుకోను..మా వాళ్ళ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ మంచు విష్ణు మాస్ వార్నింగ్!

కొండా సురేఖ పై నాగార్జున నాంపల్లి హై కోర్టులో కేసు వేయడం, నిన్న కోర్టు లో నాగార్జున తన వాదనను వినిపించి రావడం ఇవన్నీ మనం చూసాము. రీసెంట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు, ప్రతీ చిన్న విషయంలోనూ సినీపరిశ్రమ వారిని అత్యంత హేయంగా అవమానించే వారికి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 9, 2024 / 03:29 PM IST

    Vishnu Manchu

    Follow us on

    Vishnu Manchu: ఇటీవల కాలం లో కొండా సురేఖ సినీ నటులైన అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మరియు సమంతలపై చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తీవ్రంగా ఖండించింది. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు ప్రతీ ఒక్కరు మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చారు. ఇండస్ట్రీ నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రభుత్వం లో ఉన్నవారిపై కామెంట్స్ చేసేందుకు ముందు వెనుక ఆలోచిస్తూ ఉంటారు సినీ ప్రముఖులు. ఎందుకంటే వాళ్ళ జోలికి పోతే సినిమా విడుదల సమయాల్లో ఎన్నో ఆటంకాలు ఎదురు అవుతాయి అనే భయం ఉంటుంది. గత ఐదేళ్ళలో ఇలాంటి ఘటనలు మనం చాలానే చూసాము.

    ఇదంతా పక్కన పెడితే కొండా సురేఖ పై నాగార్జున నాంపల్లి హై కోర్టులో కేసు వేయడం, నిన్న కోర్టు లో నాగార్జున తన వాదనను వినిపించి రావడం ఇవన్నీ మనం చూసాము. రీసెంట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు, ప్రతీ చిన్న విషయంలోనూ సినీపరిశ్రమ వారిని అత్యంత హేయంగా అవమానించే వారికి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం మా సినీ పరిశ్రమ మొత్తం ఎంతో శ్రమిస్తుంది. దయచేసి మా వ్యక్తిగత జీవితాలను మీ స్వార్ధ రాజకీయాల కోసమో, లేదా మరో దానికోసమే వాడుకోవద్దు. మనమంతా ఒకరిని ఒకరు మర్యాదగా గౌరవించుకోవాలి. అలాంటి పరిస్థితులు ఉండాల్సింది పోయి, ఇలాంటి ఘటనలు జరగడం నా మనసుకి చాలా బాధని కలిగించింది. నా సినీ పరిశ్రమపై ఎవరైనా అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తే కచ్చితంగా నేనైతే చూస్తూ ఊరుకోను’ అంటూ మంచు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెసిడెంట్ గా కొండా సురేఖకు, అలాగే సినీ పరిశ్రమలోని నటీనటలను తక్కువ చూపుతో చూసేవారికి అదిరిపోయే ఆయన స్టైల్ లో ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

    ఇది ఇలా ఉండగా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్న మంచు విష్ణు ఇప్పుడు ‘కన్నప్ప’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుమారుగా 200 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, శివ రాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ రాగా, అది సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, ఈ ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మోహన్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ, సినిమాలో కూడా ఆయన ఒక కీలక పాత్ర చేసాడు. మరి ఈ సినిమాతో అయినా మంచు విష్ణు పెద్ద హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.