Balapur Laddu 2024: బాలాపూర్ లడ్డూకు 30 ఏళ్ల చరిత్రం ఉంది. 1994 నుంచి బాలాపూర్ లడ్డూను వేలం వేస్తున్నారు. తొలి ఏడాది కేవలం రూ.450 పలికిన లడ్డూ.. 1994 నుంచి 2001 వరకు క్రమంగా ధర వేలల్లో పెరిగింది. ఏటేటా తన రికార్డును తిరగరాస్తోంది. అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. 2002లో తొలిసారి లక్షల్లోకి చేరింది. ఆ తర్వాత నుంచి ధర లక్షల్లో పెరుగుతూ వస్తోంది. తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటోంది. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షలు పలికింది.
లడ్డూ కోసం పోటీ..
బాలాపూర్ లడ్డూ కోసం వందల మంది ఏటా పోటీ పడుతుఆన్నరు. లక్షల రూపాయలు వెచ్చించి లడ్డూ సొంతం చేసుకుంటున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వేలంలో పాల్గొంటున్నారు. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం రూల్ బుక్ మారింది. వేలంలో పాల్గొనేవారు గతేడాది మొత్తాన్ని డిపాజిట్ చేయాలని సూచించారు. అంటే రూ.27 లక్షలు డిపాజిట్ చేసిన వారు మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ రూల్ గతంలో స్థానికేతరులకు మాత్రమే ఉండగా, ఈసారి స్థానికులకు అమలు చేశారు. వేలం పోటీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రూ.30 లక్షల పలికిన లడ్డూ..
ఇక బాలాపూర్ లడ్డూ ఈసారి గత రికార్డును తిరగరాసింది. ఈసారి రూ.30 లక్షలు పలికింది. వేలంలో పాల్గొన్న సింగిల్ విండో చైర్మన్ కొలను శంకర్‌రెడ్డి రూ.30 లక్షల 1000 కి లడ్డూను దక్కించుకున్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయనకు లడ్డూను అందించారు. గతేడాది రూ.27 లక్షలు పలకగా, ఈసారి రూ.3 లక్షల 1,000 అధికంగా పలికింది.