Fish Venkat death cause: ప్రముఖ సినీ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) నిన్న రాత్రి చనిపోయిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. సినీ సెలబ్రిటీలు ఆయన మరణ వార్త పట్ల ఎలాంటి సంతాపం ని వ్యక్తం చేయలేదు కానీ , సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాత్రం తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో వందల సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టు గా నటించి, తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ఫిష్ వెంకట్. ఏడాది కి కనీసం 20 సినిమాల్లో నటించేంత బిజీ గా ఉండే ఫిష్ వెంకట్ అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం అయ్యాడు. గత కొంతకాలం క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడం తో ఫిష్ వెంకట్ ని కాపాడుకోవడం డాక్టర్లకు కష్టమైంది. కుటుంబ సభ్యులు పాపం ఆయన ప్రాణాలను రక్షించుకోవడం కోసం చాలా పెద్ద యుద్ధమే చేశారు.
Also Read: మహేష్ బాబు చేసిన సినిమాల్లో రాజమౌళికి నచ్చని సినిమా అదేనా..?
అయితే ఫిష్ వెంకట్ చనిపోవడానికి కారణం సినీ ప్రముఖుల నిర్లక్ష్యమే అని అంతా అంటున్నారు. మొదట్లో ఫిష్ వెంకట్ కి ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వెంటనే స్పందించాడు, ఆయన తనయుడు రామ్ చరణ్(Global star ram charan) కూడా స్పందించి ఇద్దరు సహాయం అందించారు. ఇక ఈ ఏడాది ప్రారంభం లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఫిష్ వెంకట్ చికిత్స కి అయ్యే ఖర్చులు భరించాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆయన వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్నప్పుడు మాత్రం ఎందుకో సినీ పరిశ్రమ స్పందన సరిగా లేదని అందరికీ అనిపిస్తుంది. ప్రభాస్(Rebel Star prabhas) రెస్పాన్స్ ఇచ్చాడని ఫిష్ వెంకట్ కూతురు మీడియా కి చెప్పుకొచ్చింది. ఆయన టీం మాతో మాట్లాడిందని, కిడ్నీ డోనర్ దొరికితే ఆపరేషన్ కి అయ్యే ఖర్చు మొత్తం మేము భరిస్తామని ముందుకు వచ్చారని, కానీ కిడ్నీ డోనార్స్ దొరకడం లేదని చెప్పుకొచ్చింది.
Also Read: వేశ్య పాత్ర చేసిన అమ్మాయి రియల్ లైఫ్ బయటపెట్టిన రానా… అందరికీ మైండ్ బ్లాక్
మొదట్లో స్పందించినట్టుగా రామ్ చరణ్ స్పందించి ఈ కిడ్నీ డోనార్స్ విషయం లో చొరవ తీసుకొని ఉంటే ఈరోజు ఫిష్ వెంకట్ ప్రాణాలు నిలిచేవి కదా?, రామ్ చరణ్ తల్చుకుంటే ఎంతసేపు?, ఆయన వెనుక అపోలో హాస్పిటల్స్ నే ఉంది కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా స్పందించి ఉండుంటే బాగుండేది అని అంటున్నారు. ఆయన ఒక పక్క సినిమా షూటింగ్స్, మరో పక్క రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఆయన గట్టిగా తలచుకొని ఉండుంటే కిడ్నీ డోనార్స్ దొరకడం అంత కష్టం అయ్యేది కాదు. కానీ ఆయన వరకు ఈ విషయం చేరిందో లేదో అనే అనుమానం అభిమానుల్లో ఉంది. వీళ్ళ సంగతి పక్కన పెడితే మా అస్సోసియేషన్ ఏమి చేస్తుందో కనీసం మంచు విష్ణు కి అయినా తెలుసో తెలియదో అంటూ నెటిజెన్స్ సెటైర్లు వేస్తున్నారు.